Powered by Blogger.

విదేశాల నుండి అరుదైన కళా

నేను . . నా ప్రజలు . . నా యానాం ఇప్పటివరకు ఈ ప్రజా ఉత్సవాలకు హాజరైన ప్రముఖులలో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వైద్య లింగం , ముఖ్యమంత్రి రంగసా...

నేను . . నా ప్రజలు . . నా యానాం ఇప్పటివరకు ఈ ప్రజా ఉత్సవాలకు హాజరైన ప్రముఖులలో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వైద్య లింగం , ముఖ్యమంత్రి రంగసామి , మాజీ కేంద్ర మంత్రి వి . నారాయణ స్వామి , గవర్నర్లుగా పనిచేసిన ఇక్బాల్ సింగ్ , ఎం . ఎం . లఖేరా , గుజర్ , ప్రస్తుత గవర్నర్ ఎ . కె . సింగ్ , మంత్రులు , ప్రభుత్వ ప్రముఖులు , తమిళనాడు గవర్నర్ కె . రోశయ్య , ఎందరో మంత్రులు వున్నారు . ఇక్కడ సత్కారాన్ని అందుకున్నారు.


అలాగే తెలుగు సినీ ప్రముఖులు డా | | సి . నారాయణ రెడ్డి , కృష్ణంరాజు , కైకాల సత్యనారాయణ , గొల్లపూడి మారుతీరావు , ఆర్ . నారాయణ మూర్తి , దేవదాసు కనకాల , కళ్లు చిదంబరం , అంజలీ దేవి , శారద , జయసుధ , గాయక ప్రముఖుడు యస్ . పి . బాలసుబ్రహ్మణ్యం , పి . సుశీల , కె . సుమ , గజల్ శ్రీనివాస్ , శోభారాణి . శోభానాయుడు , కొండవీటి జ్యోతిర్మయి డా | | సమరం , ఆర్ . పి . పట్నాయక్ , సునీత , యండమూరి వీరేంద్రనాథ్ , జి . ఎస్ . ఎన్ . రాజు , ఎన్ . వి . ఎస్ . మూర్తి లాంటి ప్రముఖులు , డాన్స్ మాస్టర్ శివశంకర్ ఇంకెందరో ఈ ఉత్సవాలకు విచ్చేసి తమ మాటలతో , పాటలతో , నృత్యాల్లో ప్రవచనాలతో అలరించారు . వీటన్నింటిని వివిధ ఛానల్స్ టెలికాస్ట్ చేసాయి .

“ ఇందులో భాగంగా దేశ , విదేశాల నుండి అరుదైన కళా రూపాలను ఎన్నుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇంద్రజాలికుడు జాదుగర్ ఆనంద్ ప్రదర్శనను ఏర్పాటు చేసాం. అందుకోసం యానాం ప్రజలందరికీ ఇంటింటికీ ఉచిత టిక్కెట్లు పంచటం జరిగింది . అరవై వేల మందికి పైగా ప్రజలు చూసారు . పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది . ఓ ఇంద్రజాల ప్రదర్శనను ఓపెన్ ఎయిర్ ఆడిటోరియమ్ లో నిర్వహించటం నాకు తెలిసి మొదటిసారి . . నేను . . నా ప్రజలు . . నా యానాం
ఇలాంటి కార్యక్రమాల కోసం స్వయంగా నేను బతిమాలు కున్నాను . ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలి . అందుకే జపాన్ నుండి , ఇతర దేశాల నుండి నృత్యకారులను తీసుకువచ్చాం.

రోబో గణేష్ నృత్యం , శివశంకర్ నృత్యం , ' ఢీ ' ' ఆట ' ' సరిగమప ' యస్ . పి . బాలు గానకచేరి , మిమిక్రి , డోనాల్క్ , జబర్దస్త్ టీమ్ ఇంకా ఎన్నెన్నో. . . ఇందువలన ఫలితం కనిపిస్తోంది . యానాంలో డాన్స్ గ్రూపులు ఏర్పడ్డాయి . అనేక పట్టణాల్లో వీరు ప్రదర్శనలు ఇస్తున్నారు . యానాం ప్రజలు మాత్రమే కాదు చుట్టు పక్కల గ్రామాల వారు ఈ ఉత్సవాలకు వస్తున్నారు ” అంటారు మల్లాడి.

ఇక్కడికి రానివారు కూడా ఛానల్స్ లో చూస్తుంటారు . అదలా వుంటే యానాం కళాకారులు కేవలం సినిమా పాటల్ని అనుకరించటం కాకుండా అది ప్రేమ కావచ్చు , అమ్మ కావచ్చు , ఓ థీమ్ ని తీసుకుని అందుకు తగ్గ నృత్యరీతుల్ని సమకూర్చుకోవటం బాగుంది .

అలానే ఈసారి ' బాడీబిల్డర్స్ ' ప్రదర్శన అద్భుతంగా వుంది.

తెలుగు పండుగ

జనవరి 1వ తేదీకి మన తెలుగువారు యిస్తున్న ప్రాధాన్యత తెలుగు పండగలకి ఇవ్వడం లేదు . తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాదితోనే మొదలవుతుంది . తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించడం , ముందుకు తీసుకుపోవటం నా కర్తవ్యంగా ఎంచుకున్నాను . - మల్లాడి నేను . . నా ప్రజలు . . నా యానాం
జనవరి మాసంలో ప్రజా ఉత్సవాలతో ఇవి మొదలవుతాయి . తెలుగువారికి నూతన సంవత్సరం ' ఉగాది ' తోనే మొదలవుతుంది . తెలు సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించటం , ముందుకు తీసుకుపోవటం కర్తవ్యాలుగా ఎంచుకున్నారు.

' పుదుచ్చేరి " అనేది తమిళ నాయకుల అధిపత్యంలో వున్న ప్రాంతం . ఇప్పటికీ ' ఫ్రెంచ్ పాలకుల నాటి ఆనవాళ్లు , అవశేషాలు అక్కడ కనిపిస్తాయి . ఏ ప్రభుత్వాలయినా అధికారంలో వుండవచ్చు . స్థానికతను మించింది లేదు అనేది మల్లాడి నమ్మకం . అందుకే ఇప్పటి తెలుగు రాష్ట్రాలకు తీసిపోని విధంగా , ధీటుగా ఆ ఉత్సవాలు జరిపిస్తారు . ఆయన మాటల్లో చెప్పాలంటే . . .

" ఉగాది పచ్చడి జీవితానికి ప్రతిబింబం . కళల్లోనే కాదు జీవితంలో నవరసాలున్నాయి . అనేక రకాల అనుభూతులున్నాయి . నవ రుచులున్నాయి . ఒక్కోసారి ఒక్కో రుచి , ఒక్కో అనుభవం ఎక్కువ స్థాయిలో వుండవచ్చు . రానున్న సంవత్సరకాలం ఈ అనుభూతులకు సిద్ధంగా వుండమని ఈ ఉగాది పచ్చడి సందేశం ఇస్తుంది . యానాంలోని ఓల్టేజ్ సంస్థ ద్వారా ఈ మహా ప్రసాదాన్ని ప్రతి ఇంటికీ పంచి పెట్టటంతో ఉగాదికి స్వాగతం పలుకుతాం . ఈ పట్టణ ప్రజలకు వేల సంఖ్యలో ఉగాది పచ్చడి డబ్బాలను అందిస్తాం .

బహుశా ఇంత విస్తృతమైన కార్యక్రమం ఏ తెలుగు పట్టణంలోనూ జరగదేమో అని విజ్ఞులు అంటుంటారు . ఇది సామూహికంగా జరిగే కార్యక్రమం .

ఉగాది అంటేనే లేత మామిడి చివుర్లు , కోకిలలు , కవుల సంరంభం . కవి అనేవాడు ఉగాదికి తప్పకుండా కవితలు రాస్తారు . ఉగాది కవుల్ని పుట్టిస్తుంది . కవులను మేల్కొలుపుతుంది కూడా . వారు తమ కవితల్లో గడిచిపోయిన సంవత్సరాల్లోని ఆనంద , విషాదాలను ప్రస్తావిస్తారు . రానున్న కాలంలో ఏం చేయాలో సూచిస్తారు . వారికి ఓ శాలువా , చిన్న అభినందన అందిస్తే పొంగిపోతారు . ఒకప్పుడు రాజులు ఇలాంటివి చేసేవారు . ఇప్పుడు ఆ పనులు ప్రభుత్వపరంగా చేయాలి . 

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: విదేశాల నుండి అరుదైన కళా
విదేశాల నుండి అరుదైన కళా
https://1.bp.blogspot.com/-Eks3WBEDrqw/XaCq5PT_0DI/AAAAAAAAAJA/5qA_D70lZtQK_OWrNZYSJbpAQTmtknp2ACLcBGAsYHQ/s1600/%25E0%25B0%25AE%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE%25E0%25B0%25A1%25E0%25B0%25BF%2B%25E0%25B0%2588%2B%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25B7%25E0%25B0%25AF%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B%25E0%25B0%25A8%25E0%25B1%2582%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B1%2587%25E0%25B0%2595%2B%25E0%25B0%25B6%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25A6%2B%25E0%25B0%25A4%25E0%25B1%2580%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%2581%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%2581..jpg
https://1.bp.blogspot.com/-Eks3WBEDrqw/XaCq5PT_0DI/AAAAAAAAAJA/5qA_D70lZtQK_OWrNZYSJbpAQTmtknp2ACLcBGAsYHQ/s72-c/%25E0%25B0%25AE%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE%25E0%25B0%25A1%25E0%25B0%25BF%2B%25E0%25B0%2588%2B%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25B7%25E0%25B0%25AF%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B%25E0%25B0%25A8%25E0%25B1%2582%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B1%2587%25E0%25B0%2595%2B%25E0%25B0%25B6%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25A6%2B%25E0%25B0%25A4%25E0%25B1%2580%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%2581%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%2581..jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/vidaeSaala-nuMDi-arudaina-kaLaa.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/vidaeSaala-nuMDi-arudaina-kaLaa.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy