Powered by Blogger.

సహాయాలు అందాయి

యానాం ప్రజల నుండి సేకరించిన రూ | | 4 , 24 , 829 మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి డి . డి. రూపంలో ప్రధానమంత్రి వాజ్ పేయికి స్వయంగా అందించ...

యానాం ప్రజల నుండి సేకరించిన రూ | | 4 , 24 , 829 మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి డి . డి. రూపంలో ప్రధానమంత్రి వాజ్ పేయికి స్వయంగా అందించాను. 2001లో కారైకల్ అగ్నిప్రమాద బాధితులకు లక్షలాది రూపాయలు పంచటం జరిగింది . 2004 లో కారైకల్ సునామీ బాధితులకు 17. 35 లక్షల నగదు, రూHI 20 లక్షల విలువ చేసే కొత్త దుస్తులు , బియ్యం , పంటసామాగ్రి , నిత్యావసర సరుకులు యిచ్చాం, 2005లో ఆంధ్రా వరదబాదితులకు దాతల సహకారంతో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ . రాజశేఖర రెడ్డి కి 10 లక్షల రూపాయలు అందించాం . 2006 ఆగస్ట్ నెలలో యానాం - ఆంధ్రప్రాంతాల్లో వరదలు వచ్చాయి . 34 లక్షల రూపాయలు విలువ చేసే 250 టన్నుల బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుకు అందజేస్తాం . 2007లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి నటాషా జార్జి వైద్యానికి , ఇలాగే అనేక మందికి లక్షలాది రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తాం. ఇటువంటివి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. | 2009 సెప్టెంబరులో యానాం ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె . రోశయ్య కు రూ . 26 , 72 , 733 / - వరద సహాయాన్ని అందించాం . 2014లో హుదూద్ తుఫాను బాదితులకు రూ . 31 , 83 , 517 / - లను దాతల నుండి సేకరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబు నాయుడు గారికి అందజేసాం . - చాలాచోట్లకు నేను స్వయంగా వెళ్లటం , నాతోపాటు మరికొందరిని తీసుకు వెళ్లటం వలన వారిలో ఇంతకుముందు అన్నట్లు ఓ విశ్వాసం కలిగించగలం. 


పరస్పరం బాధలు కలబోసుకుంటాం . మేం కూడా ఉడతా భక్తిలా సాయం అందచేయగలిగాం , యానాం అనే మారుమూల చిన్నప్రాంతం ఇలాంటి ఒడిదుడుకులకు లోనవుతున్నా , మీకు స్నేహహస్తం ఇవ్వగలుగుతున్నందుకు సంతోష పడుతోంది అని వారికి చెప్పటానికే , మరోపక్క మా వంతు సహకారంగా ఆంధ్రప్రదేశ్ లో తుఫానులు , వరదలు వచ్చినప్పుడు వస్తు రూపంలోనూ , నగదు రూపంలోనూ తక్షణ సాయం అందించటంలో యానాం ప్రజల్ని కదిలించటంలో నేను ముఖ్యపాత్ర వహించాను .

సోదరభావంతో ఒకరికొకరు సహకరించుకోవాలి అన్నదే నా భావం . ఈ పరస్పర సహకారం యిక ముందూ వుంటుంది .యానాం అనేక సందర్భాల్లో ప్రకృతి విపత్తులకు గురయింది . అప్పుడు బయటి నుండి సహాయాలు అందాయి - అనేక రూపాల్లో ముందు వారు ఏమిచ్చారు అనే దానికంటే యానాం ఒంటరిది కాదు , మనందరం మనుషులమే అన్న భావాన్ని మాకు యిచ్చింది . అలాంటిది ఇతరుల పట్ల మేం కొనసాగించాలి . - మల్లాడి ప్రకృతి విపత్తులు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావు . దేశంలోనూ , ప్రపంచంలోనూ ఎక్కడయినా ఇవి సంభవిస్తాయి . 1999 లో ఒరిస్సాలో పెను తుఫాన్ వచ్చింది . యానాం ప్రజల నుండి 8 లక్షల రూపాయల విలువ చేసే బియ్యం , దుస్తులు - మందులు - నిత్యావసర వస్తువులను అందచేసాం . విరాళాలను సేకరించి నేను స్వయంగా సహచరుల్ని , సిబ్బందిని తీసుకుని ఆ ప్రాంతాల్లో పర్యటించాను . వారికి అందచేయటం జరిగింది . రాజమండ్రిలో పిల్లా ప్రసాద్ అనే సైనికుడు కార్గిల్ యుద్ధంలో వీరమరణం చెందినపుడు ఆ కుటుంబానికి 50వేల రూపాయలు అందచేసాం , గవర్నరు నిధికి 4లక్షలు ఇచ్చాం . 2001 జనవరిలో గుజరాత్ భూకంపం వచ్చింది . లక్షల విలువైన మందులు , 6 లక్షలు విలువగల దుస్తులు , దుప్పట్లు , బియ్యం - ఇతర వస్తువులు పంపటం కాకుండా అద్భుతంగా వుంటుంది . ఇంక ' మాల్ ' చూస్తుంటే కళ్లు తిరుగుతాయి . అందుకే మన నాయకులు తరచుగా వాటి ప్రస్తావన తీసుకు వస్తుంటారు . * పాండిచ్చేరిలో ఓ ప్రజాప్రతినిధి అడిగాడు ' నా నియోజకవర్గంలోకి ఎందుకు వచ్చారు ' అని . నవ్వుకున్నాను . = ప్రజలకు సేవ చేయాలనుకుంటే ' నమ్రత ' అదే వస్తుంది . = ఇప్పుడు ' ప్రొటోకాల్ గొడవలు ఎక్కువ . అది అనవసరం అని నేను అనను . ప్రొటోకాల్ కంటే జనానికి సేవ చేయటంలో పోటీ పడితే బాగుంటుంది .


* ఓ వ్యక్తికి గౌరవం ఇవ్వటం - అతిధి మర్యాదల విషయంలో నేను ఖచ్చితంగా వుంటాను . నా శత్రువుల విషయంలో అయినా నేను మర్యాదల విషయంలో రాజీ పడను . = నేను పరిపూర్ణుడ్ని అని అనుకోను . నాకు తెలియకుండా తప్పులు జరగవచ్చు . అయితే ఓల్డేజ్ హెూమ్ ద్వారా ఎటువంటి స్వార్ధం లేకుండా నేను చేస్తున్న సేవలు నన్ను కాపాడతాయని నమ్ముతాను . డబ్బులున్నవారు ఎలా అయినా పనులు చేయించుకుంటారు . పేదవారు అలా కాదు . ఈయన వల్ల మాకీ ఉపకారం జరిగిందని గుండెల్లో పెట్టుకుంటారు . వారి కళ్లల్లో కనిపించే ఆనందాన్ని చూడటాన్ని మించిన తృప్తి వుండదు . సరదాగా . . . గంభీరంగా | నా సహచర ఎం . ఎల్ . ఎలలో పదిహేను మంది మేం మీ శిష్యులం అంటుంటారు . అప్పుడు అడుగుతాను - ఏ విషయంలో మీకు గురువుని అని . వారు చేసే పనులు నా నుండి నేర్చుకున్నవి కాదు . ఇలా చేయండి అని నేను చెప్పినవి కాదు . కొంతమందికి గురువుల నుండి గొప్ప లక్షణాలను తీసుకోవటం వుంటుంది . ఇంకొంతమంది గురువుల్లోని చెత్త లక్షణాలను తీసుకుంటారు . నేను భయపడే , దూరంగా పెట్టాలనుకున్న లక్షణాలున్నవారు నన్ను గురువు అంటే కోపం వస్తుంటుంది . ఈ మధ్య ఓ ఎం . ఎల్ . ఎ . కలిసారు . పుదుచ్చేరికి చెందిన నాయకుడు కాదు . ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ' ఎందుకు గెలిచామో అర్థం కావటం లేదు కృష్ణారావ్ , గెలవటానికి చేసిన అప్పులు కనిపిస్తున్నాయి . నువ్వు నయం నీకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అన్నారు . నాకయితే ఆ సమస్యలు లేవు .

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: సహాయాలు అందాయి
సహాయాలు అందాయి
https://1.bp.blogspot.com/-Aq5qxY6jLsw/XZ-qqCyNV0I/AAAAAAAAACo/XeVJU8Y1rJYoY5_1kxzVg7x5j9SXiFE7ACEwYBhgL/s1600/SH_IjrKwG8c.jpg
https://1.bp.blogspot.com/-Aq5qxY6jLsw/XZ-qqCyNV0I/AAAAAAAAACo/XeVJU8Y1rJYoY5_1kxzVg7x5j9SXiFE7ACEwYBhgL/s72-c/SH_IjrKwG8c.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/sahaayaalu-aMdaayi.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/sahaayaalu-aMdaayi.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy