Powered by Blogger.

మీరు ఆత్మకథ రాసే వీలుందా

అప్పుడు ముఖ్యమంత్రి వై . యస్ . ఆర్ ఫోన్ లైన్లోకి వచ్చారు . ఇంకా డెసిషన్ కి రాలేదా . నువ్వు వెంటనే బయలు దేరాలి . ఫ్లయిట్ టైం అయిపోతోంది అని...

అప్పుడు ముఖ్యమంత్రి వై . యస్ . ఆర్ ఫోన్ లైన్లోకి వచ్చారు . ఇంకా డెసిషన్ కి రాలేదా . నువ్వు వెంటనే బయలు దేరాలి . ఫ్లయిట్ టైం అయిపోతోంది అని . మరో పక్క రంగసామి , నారాయణస్వామి నువ్వొచ్చి బీ . ఫాం తీసుకోవాలని ఫోన్. మా వాళ్లు వాయిస్ పెట్టి వినిపించారు . నాకింకా ఓ అరగంట టైం వుంది సార్ అన్నాను , వై . యస్ . ఆర్ , రంగసామి , నారాయణస్వామిగార్ల తో . వెంటనే మళ్లీ ఆయన ఫోన్ . . . “ నువ్వు మీటింగ్ పక్కన పెట్టు . ఉన్నట్టుగా బయలుదేరు . విజయవాడ వెళ్లి ప్లేట్ లో బయలుదేరు . రాత్రికి నేను అస్సాం నుంచి హైదరాబాద్ కి వస్తాను . అప్పటికి నువ్వు బి . ఫాంతో నన్ను కలిసి ఉదయం బయలుదేరి నామినేషన్ వెయ్యాలి ” అన్నారు . ప్రజల మాటతో అలానే వెళ్లాను . యర్రా సుబ్రహ్మణ్యేశ్వరావు ,

చింతా వెంకటేశులు గారితో పాండిచ్చేరి , అటు నుండి చెన్నై వెళ్లి బీ . ఫాం తీసుకుని , హైదరాబాద్ వెళ్లాం . అప్పుడు వై . యస్ . ఆర్ మానవ వనరుల శాఖ దగ్గర వున్నారు . అక్కడకు వెళ్లాక ఆయన చిరునవ్వుతో “ నా మాటని గౌరవించావు కృష్ణారావు ” అంటూ “ ముందు నీకు కంగ్రాట్యులేషన్స్ ” అన్నారు . అదే రాత్రి టాక్సీలో వచ్చాం . ఉదయం జనం గుంపులు గుంపులుగా వున్నారు . రాత్రికి రాత్రి తెల్ల జెండాలన్నీ మార్చి కాంగ్రెస్ జెండాలు కట్టారు . 8 . 45 గంటలకి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేసాను . ఇంటికి వచ్చేసరికి బాక్సులు పట్టుకుని రెడీగా వున్నారు . నాకు అర్థం కాలేదు . ఏంటయ్యా అంటే డబ్బులండి . పెద్దాయన పంపించారు . ఇది ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ అన్నారు . దేనికి అంటే ఎన్నికలకు ఖర్చులుంటాయి కదా అన్నారు . నేను ప్రజా బలంతో నెగ్గగలను డబ్బు అక్కర్లేదని చెప్పాను .

ఆ డబ్బులు నాకు అవసరం లేదు . ఏభై వేల రూపాయలుంటే ఈ ఎన్నికల ఖర్చు సరిపోతుంది అని వాటిని పంపించాను . అప్పుడు ఓటర్లకి డబ్బులు పంచడం లేదు . మహా అయితే రెండు లక్షలు ఎవరయినా ఖర్చు పెట్టేవారు . పుదుచ్చేరి నుండి వచ్చిన సొమ్మును కూడా తిరస్కరించాను . ఇదీ కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక కథ . భాష మీద “ నేను ముందుగానే చెబుతాను . నేను చదువుకుంది తక్కువని . నేను భాషా పండితుడ్ని కాదు . నిత్య జీవితంలో వ్యవహరించటానికి , నా ఆలోచనలను ఎదుటివారికి అర్ధం అయ్యేలా చెప్పటానికి తగినంతగా నేర్చుకున్నాను . నేర్చుకుంటున్నాను . ఏ భాషలో అయినా తప్పులున్నా ధైర్యంగా మాట్లాడేస్తాను . తెలుగులో కూడానా అంటారు మీరు . నాకు తెలుగు కూడా పూర్తిగా రాదు . ఇది సరదాకి అనటం లేదు . భాష మహాసముద్రం , ఇంక యాసలు , మాండలికాలు , నదులు , సెలయేర్ల లాంటివి . వీటి లోతులు కొలవటం ఎవరి వల్ల అవుతుంది . మనం నేర్చుకునే భాష , జ్ఞానం , ఇవన్నీ నిన్నటి నుండి తీసుకుంటూ ఈ రోజు నిర్మించుకుంటున్నాం . రేపు అనంతం - భాషయినా , మతం అయినా , సైన్సయినా , అన్నీ నాకు తెలుసు . పరిపూర్ణ జ్ఞానవంతుడ్ని అని ఎవరయినా చెప్పుకుంటే అంతకు మించిన అమాయకులుండరు . ఎవరి స్వర్గంలో వారిని వుండనిద్దాం . నేనయితే అన్నీ నాకు తెలుసు అనుకునే అజ్ఞానిగా వుండను . తెలుగు , తమిళం , ఇంగ్లీష్ ని మాట్లాడగలను - నా తప్పులతో సహా . పూర్తిగా కాకపోయినా సారాన్ని అర్థం చేసుకుంటాను " అంటారు . అందుకే ఆయన ఎన్నో దేశాలు తిరిగారు . మానవులందరికీ ఉమ్మడి భాష ప్రస్తుతం ఆంగ్లం కావచ్చు . కాని హావభావాలుంటాయి . ఒకే రకమైన స్పందనలు వుంటాయి - కొన్ని విషయాల్లో , అవి కొంతమేర సాధారణ అవసరాలు తీర్చుతాయి . జంతువులకే మనం అన్నీ నేర్పగలుగుతున్నాం . నిజానికి ' అవసరం ' అన్నీ నేర్పిస్తుంది అనే మల్లాడిని . . .

 “ కవిత్వం - కథలు రాస్తారా , రాయాలనుకున్నారా ? ” అని అడిగితే “ నాలో సాహసం వుంది . దుస్సాహసం లేదు . అలాంటి పనులు చేయటానికి చాలామంది వున్నారు . అందుకే వారిని గుర్తించి , గౌరవించటం . నా ప్రయాణాల్లో నాతో పుస్తకాలుంటాయి . అవి చదువుతాను . ఎక్కువ సమయం వుండదు . అందరిలానే నాలో కళాకారుడున్నాడు . అప్పుడప్పుడు పాడాలని , కొన్ని పాత్రలు పోషించాలని వుంటుంది . అన్ని పనులూ ఒకరే చేయలేరు . ఆ అవసరం లేదు కూడా . మనం ఏం చేయగలం , ఏం చేయాలి అని నిర్ణయించుకోవటంలోనే మనుషుల విజయాలుంటాయి , రెండు పడవలు , నాలుగు పడవల మీద కాళ్లు వేస్తానంటే కుదరదు . మనకు రెండు కాళ్లు , రెండు చేతులు మాత్రమే వున్నాయి . వాటికి కొన్ని పరిమితులున్నాయి .

మీరు ఆత్మకథ రాసే వీలుందా ? నా జీవితం గురించి కొంతమంది రాసారు . అందులో నా భావాలుంటాయి . మాటలుంటాయి . ఇవన్నీ ఆత్మకథలో భాగాలే అనుకుంటాను . ప్రత్యేకంగా రాయటానికి ఏమీ లేదు . నేను తెరచి వున్న పుస్తకం లాంటివాడ్ని . “ మీ జీవితంలో రహస్యమంటూ లేదంటారా ? ” “ అనను . ఏ రహస్యం లేదు అనటం అతిశయోక్తి అవుతుంది ఎవరి విషయంలో అయినా , మనసులో కొన్ని దాచుకుంటాం . అందులో కొన్ని వ్యక్తిగత విషయాలుంటాయి . అవన్నీ బయటకు చెప్పటం వలన వచ్చే ప్రయోజనం లేదు . ఇంక రాజకీయాల్లోనూ , జీవితంలోనూ మనకు అనేక రకాల మనుషులు తారసపడుతుంటారు . వారిలో అనేక బలాలూ , బలహీనతలు వుంటాయి . మనం ఎంత దగ్గరగా వెళ్తే అన్ని కోణాలు తెలుస్తాయి . వారు బయటకు కనిపించే దానికి , లోపల వున్న మనుషులకు మధ్య అగాధాలుంటాయి .

ఇదో కోణం . మనం అత్యంత దుర్మార్గులు అనుకునేవారి అంతరంగాలు మనల్ని షాక్ కి గురి చేస్తాయి . అందుకే ఏది ఎంతవరకు చెప్పాలి అనేది నిర్ణయించుకుంటాను . సంచలనం కలిగించే అంశాలు నా అనుభవంలో వున్నాయి . అవన్నీ బహిర్గతం చేయటం వల్ల కొంతమందిని అప్రదిష్టపాలు చేయవచ్చు . అంతకుమించి సాధించేదేం వుండదు . ప్రజలకు అవసరం కలిగించే విషయాల వరకు ప్రస్తావించవచ్చు . అంతేకాదు బతికి వున్నప్పుడు చెప్పలేని వాటిని ఆ వ్యక్తులు చనిపోయాక చెప్పటం మంచిది కాదు . సమాధానం చెప్పుకోవటానికి వారుండరు . అప్పుడు ఎందుకు ధైర్యం చేయలేదు అనే ప్రశ్న వస్తుంది . మీరు వేమనలాంటి వారి నుండి , మహా నాయకుల వరకు తీసుకోండి వారి బలహీనతల కంటే , వారు సమాజానికి యిచ్చినది ఎక్కువ అయినప్పుడు మామూలు ప్రజలు బలహీనతలను పట్టించుకోరు . ప్రమాదం లేనంత వరకు ఎదుటివారిలో మంచిని చెప్పటం మంచిది అనుకుంటాను . ప్రపంచాన్ని దిగ్ర్భాంతి పరిచే రహస్యాలు నా దగ్గర లేవు . వీలయినంత ట్రాన్ఫరెంట్ గా వుంటాను . కొన్ని మర్చిపోతాను . కొన్ని ఫీలింగ్స్ ని నాకే పరిమితం చేసుకుంటాను ”

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: మీరు ఆత్మకథ రాసే వీలుందా
మీరు ఆత్మకథ రాసే వీలుందా
https://1.bp.blogspot.com/-pwHqAHEzCJM/XZ-nnz1P2xI/AAAAAAAAABA/BPJmKuMFAoM2PcEhDxj9oDX66i5BYk41wCEwYBhgL/s1600/%25E0%25B0%2592%25E0%25B0%2595%2B%25E0%25B0%25B8%25E0%25B0%25BE%25E0%25B0%25AE%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B1%2581%25E0%25B0%25A8%25E0%25B0%25BF%2B%25E0%25B0%259C%25E0%25B1%2580%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25A4%25E0%25B0%2582%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B1%2586%25E0%25B0%25B2%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B1%2586%25E0%25B0%25B2%25E0%25B1%2581%25E0%25B0%2597%25E0%25B0%25BE%2B%25E0%25B0%258E%25E0%25B0%25A6%25E0%25B0%25BF%25E0%25B0%2597%25E0%25B0%25BF%25E0%25B0%25A8%2B%25E0%25B0%25B5%25E0%25B1%2588%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25A8%25E0%25B0%25BF%2B%25E0%25B0%2585%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25A5%25E0%25B0%2582%2B%25E0%25B0%259A%25E0%25B1%2587%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%2581%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B1%2581.jpg
https://1.bp.blogspot.com/-pwHqAHEzCJM/XZ-nnz1P2xI/AAAAAAAAABA/BPJmKuMFAoM2PcEhDxj9oDX66i5BYk41wCEwYBhgL/s72-c/%25E0%25B0%2592%25E0%25B0%2595%2B%25E0%25B0%25B8%25E0%25B0%25BE%25E0%25B0%25AE%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B1%2581%25E0%25B0%25A8%25E0%25B0%25BF%2B%25E0%25B0%259C%25E0%25B1%2580%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25A4%25E0%25B0%2582%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B1%2586%25E0%25B0%25B2%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B1%2586%25E0%25B0%25B2%25E0%25B1%2581%25E0%25B0%2597%25E0%25B0%25BE%2B%25E0%25B0%258E%25E0%25B0%25A6%25E0%25B0%25BF%25E0%25B0%2597%25E0%25B0%25BF%25E0%25B0%25A8%2B%25E0%25B0%25B5%25E0%25B1%2588%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25A8%25E0%25B0%25BF%2B%25E0%25B0%2585%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25A5%25E0%25B0%2582%2B%25E0%25B0%259A%25E0%25B1%2587%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%2581%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B1%2581.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/meeru-aatmakatha-raasae-veeluMdaa.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/meeru-aatmakatha-raasae-veeluMdaa.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy