Powered by Blogger.

మీ శ్రేయోభిలాషులు !

కొందరు గృహప్రవేశం , సత్యనారాయణ వ్రతం , కొడుకూ లేదా కూతురు పెళ్లి లాంటి కార్యక్రమాలు పెడతారు . కానుకల రూపంలో కూడ పెట్టుకుంటారు . ఇలాంటివి ర...

కొందరు గృహప్రవేశం , సత్యనారాయణ వ్రతం , కొడుకూ లేదా కూతురు పెళ్లి లాంటి కార్యక్రమాలు పెడతారు . కానుకల రూపంలో కూడ పెట్టుకుంటారు . ఇలాంటివి రకరకాలు . కొందరు చేసే పద్ధతి ఇది . " సలహా ‘ దారులు ' నాకు సలహాదారులు ప్రత్యేకంగా లేరు . రాజకీయాల్లో వారి పాత్ర తప్పకుండా వుంటుంది . కొంతమందికి బహిరంగంగా వుంటారు . మరికొంతమందికి తెరవెనుక వుంటారు . కొన్ని సమయాల్లో వారి వల్ల వివాదాలు వస్తుంటాయి . అందువల్ల మీరు సలహాదార్లని పెట్టుకోలేదా ? అలా అని కాదు . ఎందుకో అలా జరిగిపోతోంది . అప్పుడప్పుడు మంచి సలహాలు తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంటుంది . ఇంకో కోణంలో చిన్నపిల్లల దగ్గర్నుండి ఎవరేం చెప్పినా నేను వింటాను . అలాగే నేను అనేక రకాల వ్యక్తుల్ని , సెలబ్రిటీస్ ని , అధికారుల్ని కలుస్తుంటాను . వారితో నా ఆలోచనలను కలబోసు కుంటాను . వాటి నుండి నేను ఏం చేయాలో నిర్ణయించు కుంటాను . అయితే ప్రత్యేకంగా రాజకీయ సలహాదార్లు లేరు . నా మిత్రులు రాజకీయ విషయాల మీద మాట్లాడుతుంటారు .

 
సలహాలు చెబుతుంటారు . ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు . అంతవరకే . మీకంటూ ' క్రిటిక్స్ ' వున్నారా ? అంటే ప్రత్యర్థులు కాకుండా మిమ్మల్ని హెచ్చరించే విమర్శకులు , మీ శ్రేయోభిలాషులు ! అలాంటివారు కొంతమంది వున్నారు . వారు జనరల్గా కొన్ని విషయాల మీద తమ అభిప్రాయాలు చెబుతుంటారు . కొంతమంది ఉత్తరాలు రాసేవారు . ప్రత్యేకంగా నేను చేసే ప్రతి పనినీ విమర్శించటమో , విశ్లేషించటమో చేయరు . అలాంటిది వుంటే బాగానే వుంటుంది . అలా చేయాలంటే నాతో ట్రావెల్ చేయగలగాలి . ప్రతి అంశం మీద మేం చర్చించగలగాలి . అంత తీరుబాటు అందరికీ లేదు . ఎవరి పనుల్లో వారుంటారు . కొన్ని విషయాలు మాత్రం మాట్లాడు కుంటాం . అయితే అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటాం . వాటికి చెందినవారు సూచనలు యిస్తుంటారు . మొత్తంగా అంటే మాత్రం దాదాపు లేనట్లే . మా కుటుంబ సభ్యులు కూడా అంతే . కొన్ని విషయాల్లో ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ఈ పనులు చేస్తే బాగుంటుంది అని సూచిస్తుంటారు . అంతవరకే . మీ తర్వాత నెం . 2 ఎవరు యానాం రాజకీయాల్లో ? వాస్తవానికి అన్ని పనులూ నేను దగ్గరుండి చూసుకుంటాను . ఈ నియోజక వర్గ పరిధి చాలా తక్కువ . అందులోనే ఏం చేసినా . ఇతరుల మీద బాధ్యతలు పెట్టేంత వుండదు . ఎప్పుడయినా పరిధి పెరిగినప్పుడే అన్ని పనులూ మనం చేయలేం .

అలాగే వయసు పెరుగుతున్నప్పుడు కూడా . ఓ పెద్ద సంస్థను నిర్మించాలన్నా , వ్యాపార సామ్రాజ్యం విస్తరించాలన్నా అప్పుడు నిపుణులు అవసరం అవుతారు . ఏ యూనిట్ కి ఆ యూనిట్ బాధ్యతలు తీసుకోవటం వుంటుంది . అయితే ఎలాంటి సహాయకులు లేకుండా ఈ పనులన్నీ నేనే చేస్తున్నానని అర్థం కాదు . రాజకీయంగానే ఈ ప్రశ్నకు బదులు ఇస్తున్నాను . రాజకీయపరంగా నెంబర్లు ఒకరు తయారు చేస్తే వచ్చేవి కావు . వారు చేసే పనులను బట్టే వుంటుంది . అంతేనా ! మీరు మర్రి వృక్షంగా మారిపోయారా ? అలా అనేం కాదు . రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఇతరులను ఎదగనీ యకపోవటం సహజం . అయితే నా దృష్టిలో మనం ఎవరినీ నాయకులుగా తయారు చేయలేం అనుకుంటాను . కొన్ని సందర్భాలు నాయకుల్ని తయారు చేస్తాయి . అయితే చరిత్ర చూసినప్పుడు ఆ నాయకులు తర్వాత కాలంలో తెరమరుగయ్యారు . అందుకు కారణం నిజాయితీగా వుండకపోవటం . వారికి ఇంకో గమ్యం వుండటం . వారసత్వ రాజకీయాల్లో గమనించినా , సినిమాలు - వ్యాపార రంగాలను చూసినా అవన్నీ ప్రాథమికంగా ఆ రంగాల్లో ఇతరులంత కష్టపడకుండా కాలు మోపటానికి అవకాశం ఇస్తాయి . అయితే కొంతకాలం మనం ఎవరినైనా రుద్దగలం తప్ప శాశ్వతస్థానం కల్పించలేం . ఇది వరకు రాజకీయాలు వేరు . ఇప్పుడు వేరు . ప్రత్యామ్నయం లేకపోవటం వలన కొంతకాలం ఇవన్నీ కొనసాగుతాయి . రాజకీయాలు ఓ కళ . అందులోకి రాదలుచుకున్నప్పుడు ఎన్నో కష్టనష్టాలకు సిద్దపడాలి . ఫెయిల్యూర్స్ ని తట్టుకోవాలి . కేవలం ఓ కులం మద్దతు వుంటే చాలదు . కొన్ని వందల కులాలున్న దేశం యిది . అందరినీ ఆకర్షించగలగాలి . ప్రేమించగలగాలి . నమ్మకాన్ని ఇవ్వాలి . ఇక్కడి రాజకీయం వేరు . అందుకే కొంత ఆలస్యం జరుగుతుంది.


ఎవరు ఎలా రూపొందుతారో ఇప్పుడు చెప్పటం కష్టం . నా దృష్టిలో యానాంని కాపులు - అగ్నికుల క్షత్రియులు ఇప్పటి వరకు పాలించారు . ఆ అవకాశం ఆది ఆంధ్రులకు రావాలి అని నా కోరిక . అందుకు నా వంతు ప్రయత్నం నేను చేసాను . చేస్తున్నాను . చేస్తాను . రిజర్డ్ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా వారిని నిలిపి కౌన్సిలర్ - వైస్ ఛైర్మన్ పదవులు ఇప్పించటం జరిగింది . ప్రజా జీవితంలో మన సేవలకు తప్ప స్థానాలకు నెంబర్లు వుండవు . వుండకూడదు . రాష్ట్ర స్థాయి ఆది ద్రావిడ కార్పొరేషన్లో ఇద్దరు వ్యక్తులకు నాకిస్తానన్న పదవులు వారికి ఇప్పించడం జరిగింది . అధికారులుగా అన్ని శాఖలలో ఎస్ . సి . వర్గాల వారినే నియమించటానికి చర్యలు తీసుకున్నాను .

అవకాశం వున్న ప్రతిచోట ఇలాగే చేశాను . ప్రత్యర్థులు మల్లాడి మీద చేసే విమర్శలు - అతనో నియంత , - మల్లాడి తను అనుకున్నదే చేస్తాడు . - ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాడు . - ప్రజల్ని అతని మాటల్తో మాయ చేస్తాడు | మల్లాడి సమాధానం నియంత , డిక్టేటర్ ఇలాంటివి సినిమా పేర్లుగా బాగుంటాయి . సాహిత్యానికి , కళలకు కూడా బాగుండవచ్చు . ఇలాంటి వాటిలో ఓ ఊపు వుంటుంది . అంతవరకే , చరిత్రలో “ నియంత ' లున్నారు . వారి ఆశయం ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం . హిట్లర్ - ముస్సోలిని - ఇంకా కొంతమంది వున్నారు . చరిత్రలో అలాంటి వారు విధ్వంసాన్ని సృష్టించారు . మారణహోమాన్ని చేశారు . అలాంటి వారిని వ్యక్తులుగా కొంతమంది అభిమానించవచ్చు . ఆరాధించవచ్చు గాని ప్రపంచంలో మిగతా అందరూ ద్వేషిస్తారు . అలాంటి నియంతలు మళ్లీ మానవ జీవితంలోకి రాకూడదు . | అనుకుంటారు . | నేను ' యానాం ' అనే 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి పరిమితం . ఇదే నా ప్రపంచం . ఇందులో నేను నియంతనని వారు అంటారు . నా నియంతృత్వం ఏ విధ్వంసాని వారు చెప్పాలి .

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: మీ శ్రేయోభిలాషులు !
మీ శ్రేయోభిలాషులు !
https://1.bp.blogspot.com/-ErJ5oNwdLc4/XZ-qqLAfe-I/AAAAAAAAACg/pgq--c18j6YNQ_9ZcE9ScpHypIIlgToZQCLcBGAsYHQ/s1600/2ShvY8Lf6l0.jpg
https://1.bp.blogspot.com/-ErJ5oNwdLc4/XZ-qqLAfe-I/AAAAAAAAACg/pgq--c18j6YNQ_9ZcE9ScpHypIIlgToZQCLcBGAsYHQ/s72-c/2ShvY8Lf6l0.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/mee-SraeyObhilaashulu.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/mee-SraeyObhilaashulu.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy