Powered by Blogger.

మాట్లాడే ముందు ఇలాంటివన్నీ

ఈ దేశంలో వారు ఆస్తులు కొనుక్కున్నారు . వారు పారిస్ వెళ్లాలనుకున్నప్పుడు వారి - భూములను ఆక్రమించుకోవటం , వారు కట్టుకున్న భవంతులను ఆక్రమించట...

ఈ దేశంలో వారు ఆస్తులు కొనుక్కున్నారు . వారు పారిస్ వెళ్లాలనుకున్నప్పుడు వారి - భూములను ఆక్రమించుకోవటం , వారు కట్టుకున్న భవంతులను ఆక్రమించటం , అద్దెకు 3 వారి ఇళ్లలో చేరి ఖాళీ చేయకపోవటం లాంటి సమస్యలు వున్నాయి . వారు ఆ - సమస్యలను నా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు పరిష్కరించాను . నేను పుదుచ్చేరి రా ప్రభుత్వంలో మంత్రిగా వుండగా అలాంటి ఆక్రమణలను తొలగించటం , అద్దెలకున్న వారిని ఖాళీ చేయించటం లాంటివి చేసాను . అందువలన వారికి నేనంటే అభిమానం . ఆ ఫ్రెంచి కౌన్సిలేట్ యిక్కడ వుంది . ప్రతి సంవత్సరం జూలై 14న ఇక్కడ వారిం ఉత్సవం జరుగుతుంటుంది . అందులో పాల్గొనటానికి మంత్రులకు మాత్రమే ఆహ్వానం వుంటుంది - ముఖ్యమంత్రి , గవర్నర్ లాంటి వారికి కాక . అయితే ఇప్పటికీ నేను " శాసనసభ్యుడ్ని మాత్రమే అయినా నాకు ఆహ్వానం పంపిస్తున్నారు . ఇటీవల కాలంలో మంత్రులందరికీ కూడా ఆహ్వానాలు అందటం లేదు . వాటిని మరీ ముఖ్యులు అనుకున్నవారికే పరిమితం చేస్తున్నారు . అయినా యానాం ప్రతినిధిగా నన్ను గౌరవిస్తున్నారు.


నాకు ఇది ఆనందాన్ని మాత్రమే కలిగించదు . గర్వంగా వుంటుంది . ఫ్రెంచ్ వారి మన్ననలను కూడా నేను పొందగలిగానని . పుదుచ్చేరికి - ఫ్రెంచి వారికి మధ్య సంబంధాలు మరింత దృఢతరం కావడానికి నేను టూరిజం శాఖను నిర్వహించినప్పుడు కదలిక తీసుకు వచ్చాను . ఫ్రెంచి వారికి - పాండిచ్చేరికి మధ్య సంబంధాలు పటిష్టం కావాలి . మనకు ఫ్రెంచి వారి నుండి ఆర్థిక సాయం కావాలి . రెండవది ఫ్రాన్స్ నిర్మాణ రీతులు మనకు కావాలి . వారు ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాలు కట్టారు . అలాగే మనం సాధిస్తున్న వాటిని వారికి పరిచయం చేయాలి . మన పాలకులుగా వున్నవారు , మన దగ్గరకు టూరిస్టులుగా రావాలి . ఇలాంటి ఆలోచనలు ఎన్నో వున్నాయి . ఇండియన్ - ఫ్రెంచ్ ఫెస్టివల్ ని ఇక్కడ ఘనంగా నిర్వహించటం జరిగింది . నేను మంత్రిగా వుండగా ఫ్రెంచ్ వారు ఇక్కడ ఎలా పరిపాలన సాగించారు , వారి చరిత్ర ఎలా సాగింది , ముఖ్య ఘట్టాలు ఏమిటనేది ఫ్రెంచ్ భాషలో ఓ నాటకంగా తయారు చేయించి ప్రదర్శించటం జరిగింది . పుదుచ్చేరి బీచ్ రోడ్డులో గాంధీ విగ్రహం ఎదురుగా నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు . అది చూడటానికి కొందరు పారిస్ వాసులు , కళాకారులు వచ్చారు . పెద్ద ఊరేగింపు జరిపాం . ముఖ్యమైన ప్రముఖులకి విందు యిచ్చాం . పాండిచ్చేరి - ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ జరిపాం . ఇలాంటి పనుల వల్ల ఫ్రెంచివారు నన్ను అభిమానిస్తారు.


అయితే ఫ్రెంచి వారికి మనకి మధ్య ఓ ఒప్పందం జరగాలి . అది జరిగితే తప్ప విలువ వుండదు . టూరిజమ్ మంత్రిగా నేను ఇదంతా ఓ రూపంలోకి రావటానికి రెండుసార్లు వెళ్ళి దానికో భూమికను తయారు చేయించాను . అయినా జరుగుతుందని ఎవరికీ నమ్మకం లేదు . మూడోసారి నేను వెళ్లటానికి ముందు కేంద్ర మంత్రి నారాయణస్వామిగారి సహకారంతో కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే అనుమతితో పారిస్ వెళ్లాం . ఆ బృందంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా | | ఇక్బాల్ చంద్ , టూరిజమ్ సెక్రటరీ చొల్లేటి ప్రభాకర్ , డైరక్టర్ మాథ్యూస్ సామ్యూల్లు వున్నారు . అంతటితో పని పూర్తి కాలేదు . ఆ ఎం . వో . యు మీద కేంద్రం ద్వారా సంతకాలు జరగాలి . అదో కార్యక్రమం . ఇదంతా పూర్తిగా నా మీద వదిలేస్తారు . అన్నీ ఆయన చేయించుకొస్తాడని , లేకపోతే మూలన పడుతుందనుకునేవారు . జైపాలరెడ్డిగారు నాకు సహకారం అందించారు . 2010లో ఆ ఒప్పందం మీద సంతకాలు పూర్తయ్యాయి . 2012లో తుఫాన్ వచ్చింది . ఈ ఒప్పందం జరగడం వలన వారు జైకా నిధులు ఇవ్వటానికి ముందుకు వచ్చారు.


ఆ రకంగా కేవలం పుదుచ్చేరికి మాత్రమే కాకుండా మన దేశానికి ఉపకరించే అంశాలు అందులో చాలా వున్నాయి . ఎం . వో , యు ఫలితంగా నిధులు శాంక్షన్ అయ్యి పనులు మొదలుపెట్టడానికి తుది దశకు చేరుకున్నాయి . అందుకే మనం ఏదన్నా మాట్లాడే ముందు ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో వున్నా ఎందుకని అధికారంలో వున్నప్పుడు మిగతావారు దృష్టి కేంద్రీకరించలేదు ? అందుకు ఎవరు అడ్డు పడ్డారు ? ఈ సమస్యలన్నీ నాకూ వున్నా ఎలా అధిగమించగలిగాను అన్నది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది . ఇరుగు పొరుగు భౌగోళికంగా చూసుకున్నప్పుడు యానాం తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా వుంది . యానాం , తూర్పు గోదావరి జిల్లాలు వేర్వేరు ప్రభుత్వాల ఆధీనంలో పని చేస్తుంటాయి . నిత్యావసరాలయిన తాగునీరు , సాగునీరు , విద్యుత్ లాంటివి ఆంధ్ర ప్రాంతం నుండే అతి చిన్న ప్రాంతం అయిన యానాంకి అందాలి . అందుకే చుట్టు పక్కల వారితో మంచి సంబంధాలు కలిగి వుండాలి.


1974లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పని చేసారు . ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం యానాంకి వచ్చినప్పుడు జరిగిన బహిరంగ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు . ' మీకు నీరు , విద్యుత్ , ఆంధ్రప్రదేశ్ నుండివస్తున్నాయని మరిచిపోవద్దు . ఇక్కడ మా పార్టీ అభ్యర్థి గెలిస్తేనే సమన్వయంతో గెడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి . లేకపోతే మీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు . ' - అని హెచ్చరిక జారీ చేస్తారని యిప్పటికీ ఆనాటి ప్రజలు చెప్పుకుంటారు . మల్లాడి మాటల్లో చెప్పాలంటే . . . . “ నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికవక ముందున్న శాసన సభ్యుల వరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో గాని , జిల్లా అధికారులు , అనధికారులతో గాని సత్సంబంధాలు ఏర్పరుచుకోలేదు . కనీసం అందుకు ప్రయత్నం కూడా చేయలేదు . ఎలాంటి చిన్న లేదా పెద్ద సమస్య వచ్చినా దూరంగా వున్న పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారా సంప్రదించటాలు కుదరదు . కాలయాపన జరుగుతుంది . ఇవన్నీ నేను ఆలోచించాను . హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు నాయుడు , వై . యస్ . రాజశేఖర రెడ్డి గార్లతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాను . తూర్పు గోదావరి జిల్లాలో పని చేసిన కలెక్టర్లందరితో స్నేహంగా వున్నాను . యానాంలో జరుగుతున్న కార్యక్రమాలను వారు గమనించాక , కాకినాడ - యానాం సమస్యలను వారు చర్చించి పరిష్కరించేవారు . నా పట్ల వారు ఎంతో అభిమానం చూపించేవారు . జి . ఎం . సి . బాలయోగి , చంద్రబాబు నాయుడు , వై . యస్ . రాజశేఖర రెడ్డి గార్లు ఎప్పుడూ నన్ను పరాయి మనిషిగా చూడలేదు.


వై . యస్ . ఆర్ అయితే స్వంత ఎమ్మేల్యేల కన్నా మిన్నగా నన్ను చూసుకున్నారు . అందుకే నేను అడగ్గానే మంచినీటి చెరువు కోసం 53 ఎకరాలు ఆంధ్రప్రాంత రైతుల దగ్గర కొని పుదుచ్చేరి ప్రభుత్వానికి యిచ్చారు . అలాగే ద్రాక్షారామం రోడ్డు నుండి యానాం మార్కెట్ కమిటీ భవనం వరకూ రహదారి అభివృద్ధికి అనుమతి తీసుకురావటం వంటివి వారితో నాకున్న స్నేహ సంబంధాల వల్ల సాధ్యం అయ్యాయి. 

యానాంలో వున్న వ్యాపారస్థుల సమస్యల్ని పరిష్కరించారు . ధవళేశ్వరంలో పంప్ హౌస్ కట్టుకోవటానికి , అక్కడ నుండి పైప్ లైన్ ద్వారా నీటిని తెచ్చుకోవటానికి అనుమతి ఇప్పించారు . అమరజీవి పొట్టి శ్రీరాములు వారధికి ఎప్రోచ్ రోడ్ కి భూమినిచ్చి చంద్రబాబు నాయుడు సహకరించారు .

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: మాట్లాడే ముందు ఇలాంటివన్నీ
మాట్లాడే ముందు ఇలాంటివన్నీ
https://1.bp.blogspot.com/-YhOXbNZz5tE/XZ-mz_MgyyI/AAAAAAAAAAo/I0AY1ZJu8b0oSnc7xcui6to_hogloziZQCLcBGAsYHQ/s1600/%25E0%25B0%2586%2B%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B0%25BF%25E0%25B0%2595%25E0%25B0%25BF%2B%25E0%25B0%2585%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25A8%25E0%25B0%25BF%2B%25E0%25B0%25B8%25E0%25B0%25A6%25E0%25B1%2581%25E0%25B0%25AA%25E0%25B0%25BE%25E0%25B0%25AF%25E0%25B0%25B2%25E0%25B0%25A4%25E0%25B1%258B%2B%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%25E0%25B0%25A4%2B%25E0%25B0%25AD%25E0%25B0%25B5%25E0%25B0%25A8%25E0%25B0%2582%2B%25E0%25B0%25A8%25E0%25B0%25BF%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AE%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%2581%2B.jpg
https://1.bp.blogspot.com/-YhOXbNZz5tE/XZ-mz_MgyyI/AAAAAAAAAAo/I0AY1ZJu8b0oSnc7xcui6to_hogloziZQCLcBGAsYHQ/s72-c/%25E0%25B0%2586%2B%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B0%25BF%25E0%25B0%2595%25E0%25B0%25BF%2B%25E0%25B0%2585%25E0%25B0%25A8%25E0%25B1%258D%25E0%25B0%25A8%25E0%25B0%25BF%2B%25E0%25B0%25B8%25E0%25B0%25A6%25E0%25B1%2581%25E0%25B0%25AA%25E0%25B0%25BE%25E0%25B0%25AF%25E0%25B0%25B2%25E0%25B0%25A4%25E0%25B1%258B%2B%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%25E0%25B0%25A4%2B%25E0%25B0%25AD%25E0%25B0%25B5%25E0%25B0%25A8%25E0%25B0%2582%2B%25E0%25B0%25A8%25E0%25B0%25BF%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AE%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%2581%2B.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/maaTlaaDae-muMdu-ilaaMTivannee.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/maaTlaaDae-muMdu-ilaaMTivannee.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy