Powered by Blogger.

కళా రంగం యానాం కళా ఉత్సవాలను ఈసారి నేను రెండు రోజులు చూడగలిగాను

యానాం కళా ఉత్సవాలను ఈసారి నేను రెండు రోజులు చూడగలిగాను . అందులో ప్రధానంగా నేను గమనించిన విషయం ఒకటుంది . ఉదయం నుండి ' మల్లాడి ' గార...

యానాం కళా ఉత్సవాలను ఈసారి నేను రెండు రోజులు చూడగలిగాను . అందులో ప్రధానంగా నేను గమనించిన విషయం ఒకటుంది . ఉదయం నుండి ' మల్లాడి ' గారు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు . వివిధ సభల్లో మాట్లాడారు . సాయంకాలం కార్యక్రమాలు మొదలయిన దగ్గర్నుంచి ఆయన వేదిక ముందు - వెనక - చుట్టుపక్కల నిలబడే వున్నారు . ఎనిమిది చోట్ల అంటే నాలుగు దిక్కుల అయి మూలల్లో ఎక్కడో ఓ చోట నిలబడి ఓ పక్కన నిర్వాహకులకు సూచనలిస్తూ, పోలీసు యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తూ , అక్కడకు వచ్చిన వేలాది మంది ప్రజలను గమనిస్తూ, వారి ప్రతి స్పందనని తన మనసులో రికార్డ్ చేసుకుంటున్నారు.


ఓ పక్కన అతిథులు వస్తున్నారు . కుటుంబ సభ్యులు వస్తున్నారు . ఎటు చూసినా గుంపులు గుంపులుగా జనం , మరో పక్కన కార్యక్రమాలకు కళాకారులు తయారవటం , బ్యాక్ డ్రాప్లో పెద్ద స్క్రీన్ , సౌండ్ సిస్టమ్ , అకేలా క్రేన్స్- ఎన్నో కెమెరాలు, ప్రతి చిన్న రియాక్షన్ని చూపిస్తున్నాయి . ఆన్లైన్ ఎడిటింగ్ జరుగుతోంది . వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు, వారిని రిసీవ్ చేసుకోవటం నుండి వారికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించటం, సుశిక్షితులైన కేడర్క ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటం , ఇదంతా ' ఒన్మషో ' లా అనిపిస్తుంది.

కార్యక్రమం పూర్తవటానికి రాత్రి పన్నెండు గంటలు కావొచ్చు . తర్వాత అన్నీ సమీక్ష చేసుకుని ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో , ఎప్పుడు నిద్రపోతారో తెలియదు . తిరిగి ఉదయం లేవటం , వాకింగ్ కి వెళ్లటం - షటిల్ ఆడటం , ఈ ఉత్సవాల సమయంలోనూ తనని కలుసుకుంటానికి వచ్చే ప్రజలకి సమయం కేటాయించటం , పుట్టినరోజులకో , పెళ్లిళ్లకో మరో కార్యక్రమానికో హాజరు కావటం చేస్తూనే వున్నారు . ఇన్ని కార్యక్రమాలను ఆయన ఎక్కడా నోట్ చేసుకున్నట్లు నాకు కనిపించలేదు . ఈ వేదిక మీద చాలామంది ప్రముఖులకి సన్మానం చేసినప్పుడు ఆయన ప్రసంగిస్తూ “ నాకు భగవంతుడు జ్ఞాపకశక్తిని యిచ్చాడు . గతంలో జరిగిన ELCOM నేను . . నా ప్రజలు . . నా యానాం విషయాలు గాని , ప్రస్తుతంలో జరుగుతున్నవి గాని నాకు గుర్తుంటాయి ” అన్నారు . అందుకే ఆయనగాని , ఆయనతో వుండేవారుగాని ఏదీ నోట్ చెయ్యరు . అలాగే ఆయన ఫోన్ కి విరామం అంటూ వుండదు .

అప్పటి సందర్భాన్ని బట్టి ఫోన్ తీయకపోయినా, తర్వాతయినా ఆయన స్పందించటం జరుగుతుంది.

ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఆయన ముఖంలో చెమటలు కనిపిస్తాయి తప్ప కళ్లల్లో అలసట కనిపించదు . ఇంతగా ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులని నేను అరుదుగా చూసాను . అధికారంలో వున్న వ్యక్తుల పట్ల నాకు అంత విశ్వాసం లేదు . ఎన్నికల ముందు వరకు వుండే వ్యక్తులు వేరు , ఎన్నికయ్యాక వ్యక్తుల అసలు రూపం మనం చూస్తాం . ప్రజల మనుషులం అని చెప్పుకునేవారు ఇంకా అధికారం రాకముందే గంభీరంగా బిగుసుకుపోవటం , తమను తాము ప్రత్యేకంగా భావించుకోవటం నేను చూసాను . కొంతమంది బాడీ లాంగ్వేజ్ , మాట తీరు అలా వుంటుంది . అయితే కొంతమందిని చూసినప్పుడు అందరినీ ఒకే గాటన కట్టకూడదు అని ఇంకోసారి నాకు అర్థమైంది.

2002 నుండి ఈ ఉత్సవాలు జనవరి 6 , 7 , 8 , తారీఖుల్లో జరపటం మొదలయింది . కొన్ని సందర్భాల్లో తేదీలు మారాయి గాని , ఖర్చు పెరిగినా లక్షలాది రూపాయలతో ఈ ఉత్సవాలు ఇప్పటి వరకూ నిరాటంకంగా సాగుతూనే వున్నాయి . యానాం ప్రాంతపు కళాకారులను సత్కరించటం , ప్రోత్సహించటంతో పాటు వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులయిన వారిని సన్మానించుకోవటం కోసం ఓ సంస్థను ఏర్పాటు చేయటం మల్లాడి ఆశయం.

" మామూలుగా తెలుగువారికి సంక్రాంతి పర్వదినం . అయితే సంక్రాంతికి ముందే పండగ వాతావరణం ' యానాం ' కి తీసుకురావాలని నా కోరిక . సమాజానికి తమ సృజన ద్వారా సేవలు చేసేవారిని గుర్తించి వారిని సత్కరించటం వలన యానాంలో వున్న పాత , కొత్త తరాలకు ప్రేరణ నివ్వాలనేది నా ఆలోచన . అప్పుడే నూతన కళాకారులు తయారవుతారు . వారు యానాం పరిధి దాటి జాతీయంగా , అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు.

అదే సమయంలో యానాం ఉత్సవాల్లో పాల్గొని సన్మానం అందుకోవటం ఎవరికయినా గొప్ప గౌరవంగా అనిపించాలి . ఇదే నా తపన . అలాగే కేవలం టీ . వీ . ల్లోనో , నేను . . నా ప్రజలు . . నా యానాం పత్రికల్లోనో , సినిమాల్లోనో చూసే ప్రముఖుల్ని ప్రత్యక్షంగా యానాం ప్రజలకు చూపించాలి అనేది నా తపన . నేను కూడా గౌరవించే , అభిమానించే , ప్రేరణ పొందిన ఎందరినో ప్రత్యక్షంగా చూడలేకపోయాను . అందులో కొంతమంది చనిపోయారు . వృద్ధాప్యంలో కదలలేని స్థితిలో వున్నారు . అయితే నాకు జీవితం అవకాశం యిచ్చింది . యానాం యిచ్చింది . ఇక్కడి ప్రజలు యిచ్చారు . అందుకే నా వంతుగా నా ప్రజలకు మధురమైన జ్ఞాపకాలను అందించాలనేది నా ఆరాటం ” అంటారు మల్లాడి

ఈ వేడుకలను జి . ఎం . సి . బాలయోగి క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తారు . ఈ ప్రజా ఉత్సవాల్లో పుదుచ్చేరి , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాలలో వున్న ముఖ్యమైన తెలుగు వారిని ఆహ్వానిస్తారు . ఇందులో కళాకారులు మాత్రమే కాదు రాజకీయ ప్రముఖులు , అధికారులు , ఉద్యోగులు వుంటారు. సామాన్యులుంటారు . దేశ , విదేశాల నుండి వచ్చే కళా ప్రదర్శనలు వుంటాయి .

అయితే పుదుచ్చేరి ప్రభుత్వ పరిధిలో కేంద్రపాలన ప్రాంతాలు ఇంకా వున్నాయి . అలాంటి చోట్ల ఇలాంటివి కనిపించవు . అందుకు కారణం ఒకటే . మల్లాడి లాంటి అభిరుచి , చారవ , కృషి చేసే నాయకులు లేరు . 

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: కళా రంగం యానాం కళా ఉత్సవాలను ఈసారి నేను రెండు రోజులు చూడగలిగాను
కళా రంగం యానాం కళా ఉత్సవాలను ఈసారి నేను రెండు రోజులు చూడగలిగాను
https://1.bp.blogspot.com/-i_TDqC4xzh0/XaCrsCLvFoI/AAAAAAAAAJU/hC1i73b7QVQN9IK_E4HAT0dEALYbKqyOwCLcBGAsYHQ/s1600/%25E0%25B0%25B8%25E0%25B0%25BF%25E0%25B0%25B2%25E0%25B0%2595%25E0%25B1%2581%2B75%2B%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25A4%25E0%25B0%2582%2B%25E0%25B0%2587%25E0%25B0%25A4%25E0%25B0%25B0%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B0%2595%25E0%25B1%2581%2B50%2B%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25A4%25E0%25B0%2582%2B%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25AF%25E0%25B0%25BF%25E0%25B0%25A4%25E0%25B1%2580%25E0%25B0%25B2%25E0%25B1%2581%2B%25E0%25B0%2595%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25AA%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%2581.jpg
https://1.bp.blogspot.com/-i_TDqC4xzh0/XaCrsCLvFoI/AAAAAAAAAJU/hC1i73b7QVQN9IK_E4HAT0dEALYbKqyOwCLcBGAsYHQ/s72-c/%25E0%25B0%25B8%25E0%25B0%25BF%25E0%25B0%25B2%25E0%25B0%2595%25E0%25B1%2581%2B75%2B%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25A4%25E0%25B0%2582%2B%25E0%25B0%2587%25E0%25B0%25A4%25E0%25B0%25B0%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B0%2595%25E0%25B1%2581%2B50%2B%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25A4%25E0%25B0%2582%2B%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25AF%25E0%25B0%25BF%25E0%25B0%25A4%25E0%25B1%2580%25E0%25B0%25B2%25E0%25B1%2581%2B%25E0%25B0%2595%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25AA%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B1%2581.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/kaLaa-raMgaM.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/kaLaa-raMgaM.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy