Powered by Blogger.

ఇంకెన్నో కోణాలున్నాయి

ఇంకెన్నో కోణాలున్నాయి . పుష్పవిలాసం తక్కువ కాదు . నేను కొన్ని విదేశాలు తిరిగాను . అక్కడ నేను గమనించింది . ఒకటుంది . మనం శుభకార్యక్రమాల్లో ...

ఇంకెన్నో కోణాలున్నాయి . పుష్పవిలాసం తక్కువ కాదు . నేను కొన్ని విదేశాలు తిరిగాను . అక్కడ నేను గమనించింది . ఒకటుంది . మనం శుభకార్యక్రమాల్లో , కుటుంబాల్లో నిర్వహించుకునే పుట్టిన రోజులు , పెళ్లిళ్లు ఇంకా అనేకానేక ఉత్సవాల్లో రకరకాల వస్తువుల్ని , డబ్బుల్ని కానుకగా ఇస్తుంటాం . అక్కడ మాత్రం ఎలాంటి సందర్భాన్నయినా పూలతో జరుపుకుంటారు.


జననం నుండి మరణం దాకా వారి జీవితంలో పూలు ఓ భాగం . మనం కూడా దండలు మార్చుకుంటాం . సభలు , సమావేశాల్లో చిన్న గులాబి పువ్వయినా అందిస్తాం . ప్రతిరోజూ భక్తులు పూలతో దేవుడ్ని పూజిస్తారు . ' పూజకు నోచుకోని పూలు ' అంటుంటారు . నేను ఒకటే కోరుకుంటాను . పూలకు నోచుకోని పిల్లలంటూ వుండకూడదు . ఆర్థిక కారణాల వల్ల మూరెడు పూలదండకి నోచుకోని వారు వుండని మంచి రోజులు ఎప్పటికయినా రావాలి . ఇంకా చూస్తే పూల పెంపకం ఆదాయ మార్గం కూడా . మనదేశం నుండి ఎగుమతి అయ్యే పూలు మిగతా కొన్ని దేశాలతో పోలిస్తే తక్కువ . మనం వివిధ దేశాల నుండి ఎన్నెన్నో రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నాం . నిజానికి 120 కోట్లకు పైగా జనాభా వున్న మన దేశంలోని అవసరాలను మనం తీర్చుకోగలిగితే చాలు , ఎంతో ఆదాయం మనకు మిగులుతుంది .

ఈ ప్రదర్శన వెనకాల ఉద్దేశం మనం పూల మొక్కల్నీ - ఫలాల మొక్కల్నీ పెంచాలనే ఆలోచన రావాలి . ఇవి రైతులకు ఉపయోగపడాలి . అందుకే సబ్సిడీ కింద నామమాత్రపు ధరకి అందిస్తున్నాం . వ్యవసాయ శాఖవారు నిర్విరామంగా పని చేస్తున్నారు . పూల మొక్కలను కానుకగా యిచ్చే సంప్రదాయాన్ని ముందుకు తీసుకువె క్తున్నాం . ఈ పూల , ఫల పెంపకందార్లని ప్రోత్సహించటం కోసం బహుమతులు ఇస్తున్నాం . మనం హరిత విప్లవాన్ని విజయవంతం చేయాలి . అది మన పిల్లలకోసం , రేపటి తరాల కోసం మాత్రమే కాదు . మొత్తం మానవాళి కోసం ఈ పని చేయాలి . ఇప్పటికే ప్రకృతిని ధ్వంసం చేసుకుని ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం . ఇప్పటికయినా మేలుకుంటే మంచిది " అంటారు మల్లాడి .

ఈ ప్రదర్శనలో పూలు మాత్రమే కాదు . ఫలాలు , కూరగాయల్లో అనేక రకాలున్నాయి . అవి సైజులో చాలా పెద్దవిగా వున్నాయి . నేను . . నా ప్రజలు . . నా యానాం

మనకు భూమి తక్కువ . ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోతుంది . జనం పెరిగారని భూమి పెరగదు . సముద్రాలు ఇంకిపోవు . మనం ఇల్లు కట్టుకోవాలన్నా , ఫ్యాక్టరీలు పెట్టాలన్నా , యూనివర్సిటీలు పెట్టాలన్నా , ఏ చిన్న పని చేయాలన్నా ముందు కావలసింది భూమి . దీని చుట్టూనే రాజకీయం , యుద్ధాలు , రకరకాల సంఘర్షణలు జరుగుతున్నాయి . జరుగుతాయి .

 ఒక్కోసారి నాకు భయం కలుగుతుంది . మనం వున్న భూమినే పంటలు పండించటానికి అనువయినది గా తయారు చేయలేకపోయాం . సాగవుతున్న భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాల్సి వస్తుంది . ఇంతమందికి సరిపోయే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలమా అని . అయితే ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని చూసినప్పుడు , ఎకరానికి ఇప్పుడున్న దాని మీద పది రెట్లు పండించగలిగితే , సరికొత్త వంగడాల్ని సృష్టిస్తే ఇదో సమస్యకాదు అనిపిస్తుంది ” అంటారాయన .

అది వాస్తవం . ఇప్పటికే అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి . అంతరిక్షంలోనూ పంటలు పండించే ప్రయత్నాలు మొదలయ్యాయి .

 ఈ ప్రదర్శన జరుగుతుండగానే ఒకే మొక్కకి వంకాయ , టొమేటో , మిర్చిని కాయించారని , కలామ్ పేరుని ఆ ప్రయోగానికి పెట్టారని పత్రికల్లో వార్త రావటం అందమైన యాదృచ్ఛికత . అదీ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో . అసలు సమస్య ఒకటి వుంది అంటారు మల్లాడి .

" మనం ఎన్ని ప్రయోగాలు చేసినా , అభివృద్ధి సాధించినా , వాటికి మానవీయ ముఖం వుండాలి . ఉత్పత్తి జరుగుతూనే వుంది . కొన్ని దేశాలు వాటిని నేలపాలు , నీటిపాలు చేస్తుంటారు - డిమాండ్ కోసం . అంటే పంపిణీ సక్రమంగా జరగదు . ఓ దశాబ్దం పాటు ఆయుధాల మీద , రక్షణ మీద ప్రపంచ దేశాలు ఖర్చు చేయటం మానేస్తే రెండు వేల సంవత్సరాలకు సరిపోయేంత ఉత్పత్తిని , అభివృద్ధిని మనం సాధించగలం

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: ఇంకెన్నో కోణాలున్నాయి
ఇంకెన్నో కోణాలున్నాయి
https://1.bp.blogspot.com/-RXghwyTOh3Y/XaCrZqV9fsI/AAAAAAAAAJQ/--EjH5ZeuY4XtUPXYAKu0NFDwJ8xXL0ZgCLcBGAsYHQ/s1600/%25E0%25B0%25AE%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE%25E0%25B0%25A1%25E0%25B0%25BF%2B%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%25AF%25E0%25B0%2582%25E0%25B0%2597%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%2582%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25AD%25E0%25B1%2581%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%2B%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%2582.jpg
https://1.bp.blogspot.com/-RXghwyTOh3Y/XaCrZqV9fsI/AAAAAAAAAJQ/--EjH5ZeuY4XtUPXYAKu0NFDwJ8xXL0ZgCLcBGAsYHQ/s72-c/%25E0%25B0%25AE%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE%25E0%25B0%25A1%25E0%25B0%25BF%2B%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%25AF%25E0%25B0%2582%25E0%25B0%2597%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%2582%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25AD%25E0%25B1%2581%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%2B%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B1%2582.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/iMkennO-kONaalunnaayi.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/iMkennO-kONaalunnaayi.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy