Powered by Blogger.

చరిత్ర తాలూకు ప్రత్యేకతలు

నా నోటి నుండి వచ్చే ప్రతి మాటలోనూ మీరు తప్పులు పట్టేస్తారు . మీరు చెప్పే విషయాలు నేను వినాలనుకుంటున్నాను అని చెబుతాను . ఏ ప్రసంగంలోనైనా చివ...

నా నోటి నుండి వచ్చే ప్రతి మాటలోనూ మీరు తప్పులు పట్టేస్తారు . మీరు చెప్పే విషయాలు నేను వినాలనుకుంటున్నాను అని చెబుతాను . ఏ ప్రసంగంలోనైనా చివరిగా ఇట్లు ' మీ . మల్లాడి కృష్ణారావు ' అని చెప్పి ముగిస్తాను . అది నా అలవాటు అలాగే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తుంటాం . అప్పుడూ అంతే . మనం ఒకరిని ఆహ్వానిస్తున్నామంటే అర్థం వారి జ్ఞానాన్ని , అనుభవాన్ని మనం తెలుసుకుంటానికి . అంతేగాని వారిని అడ్డం పెట్టుకుని మన పాండిత్యం ప్రకటించటానికి కాదు . " అన్నారు . ఆయన ప్రకారం “ మనల్ని మనం వ్యక్త పరుచుకోవటం ఓ అంశం . మన మాటలు మన పిల్లలకు , ఇంట్లో వారికి అర్థం కావాలి . అలాగే వారూ తమ బాధలను స్పష్టంగా చెప్పాలి .

ఇది ఇంట్లో మొదలయితే బయటివారికి మనం ఏదయినా చెప్పవచ్చు . కొంతమంది ఏం మాట్లాడుతున్నారో వారికే స్పష్టంగా తెలియదు . అంత గందరగోళం , తికమక వారిలో వుంటాయి . నా వరకు నేను అలాంటి స్థితికి రాకుండా చూసుకుంటాను . అసెంబ్లీలోనే కాదు , జీవితంలోనూ కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి . అలాంటి సందర్భంలోనే మనం ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి . అప్పటికప్పుడు వేదిక ఎక్కి ప్రసంగాలు చేయాల్సి వుంటుంది . అప్పుడు నెగ్గుకు రాగలటమే పరిణతి అంటే . ఒక్కోసారి సమయం తెలియదు .


అనేక అంశాలు దొర్లుకు పోతుంటాయి . అన్నీ యానాం అభివృద్ధికి సంబంధించినవే . ప్రస్తుతం జరుగుతున్నవి , జరగబోయేవి అలా అలా గంటలు గడుస్తాయి . కాయితం వుండదు , కలం వుండదు . అంతా జ్ఞాపకం ' అంటారు మల్లాడి . ఆహా . . . ఓహో “ నాకు పొగడ్త ఇష్టం వుండదు అనటం కంటే భయం . రాజకీయ నాయకుల్నే కాదు మనుషుల్ని పతనానికి గురి చేసేది , మనల్ని చూసి మనమే జాలిపడేలా చేయగలది పొగడ మాత్రమే అనేది నా దృష్టిలో వుంది . అందుకే బాపు - రమణగార్ల ' ముత్యాలముగ్గు ' సినిమాలో భజంత్రీలను పెట్టుకుంటాడు రావుగోపాలరావు - ఆ పారవశ్యంలో మునిగిపోతానేమోమని . ఎవరయినా నిజాయితీగానే రెండు మంచి మాటలు మాట్లాడినా భజంత్రీలు మోగుతాయి . నేను అలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు గాని అవి వింటున్నప్పుడు చెవుల్లో దూది పెట్టుకున్నట్లు వింటాను . తలకి ఎక్కించుకోను . ఎవరెందుకు పొగుడుతున్నారో , ఎందుకు తెగుడుతున్నారో అనుభవం చెబుతుంది . ”

 

అయినా కూడా ఏదొక సమయంలో పొగడకు పడిపోవటం జరగదా ? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇది . “ నిజమే . . . పొగడటం కూడా ఓ కళ , ఎదుటివారు గుర్తించకుండా పొగడటం అందులో మాస్టరీ చేయటం . మనం మామూలు మనుషులం . కొన్ని నిముషాలు కొన్ని గంటలు - కొన్ని రోజులు ఆ ప్రభావం వుండవచ్చు . ఆ తర్వాతయినా బయటకు రావాలి . పూర్తిగా ఏ పొగడ్డకీ లొంగం అనటం అతిశయోక్తి , భగవంతుడే అందుకు అతీతం కాదు . ” మీకు పొగడ్త ఇష్టం లేకపోవచ్చు . మీరు ఎవరినీ పొగడరా ? చిరునవ్వు “ పొగుడుతాను - నిజంగానే పొగడాల్సిన పనులు వారు చేసినప్పుడు . అయితే నాకు ఈ విషయం మీద కొన్ని అభిప్రాయాలున్నాయి . అభినందించటం వేరు . కృతజ్ఞత వేరు . మన అవసరాల కోసం మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పకూడదు . ఓ విషయంలో ఎవరయినా గొప్ప కృషి చేసి వుంటే , దానిని మనం గుర్తించి , ప్రేరణ పొందితే అభినందించి తీరాలి . అయితే కొంతకాలం దాటాక అభిప్రాయం మార్చుకోవటం నిజాయితీ కాదు . ఇంకా అవసరాల కోసం చేసే అభినందన లేదా పొగడను ' సోప్ ' రాయటం అనొచ్చు .

' పొగడ్త హృదయం నుండి రావాలి . నా వరకు నేను అవసరానికి మించి పొగడటానికి ఇష్టపడను . మన పని మనం చేస్తున్నామని అందరూ గుర్తించాలి . అదే సమయంలో మీలాంటి రచయితలూ కళాకారులూ కాస్త అభినందనల్ని ఆశిస్తారు కదా ” “ కాస్త కాదు . బోల్డంత ” అన్నాను “ మేమూ అంతే ” అన్నారు మల్లాడి నవ్వుతూ తొలి విమాన ప్రయాణం తొలి విమాన ప్రయాణం ఎవరికయినా అనుభూతే . ఇప్పుడు పనుల కోసం విదేశాలు వలసలు వెళ్లేవారు ఎక్కువయ్యారు . అలాగే దేశీయంగా విమాన సంస్థల మధ్య పోటీవల్ల కొన్ని సమయాల్లో విమాన ధరలు తగ్గుతున్నాయి .

అలాగే ఐ . టి . కి చెందినవారు , రాజకీయ నాయకులు ,వ్యాపార వర్గాలు మాత్రమే కాదు సామాన్యులు కూడా ఈ అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు . అయినా కూడా విమానం ఎక్కనివారు కొన్ని కోట్ల మంది వున్నారు , విమానం పైకి లేచిన మొదటిసారి – ముఖ్యంగా కింద నావలు కనిపిస్తున్నప్పుడు “ అక్కడ కూర్చుని తల పైకెత్తి చూడాల్సినవాడిని , ఇక్కడ కూర్చోబెట్టి తలవంచి చూసేలా చేశాడు భగవంతుడు అనుకుంటాను " అంటారు మల్లాడి . ఫ్రెంచ్ వారితో . . . దూనాం ఫ్రెంచివారి పాలనలో వున్న చిన్న ప్రాంతం . ఇలాంటివి పుదుచ్చేరి , కారైకల్ , మాహే ఇవన్నీతమిళ , తెలుగు , కేరళ ప్రాంతాల్లో వున్నాయి . చరిత్ర తాలూకు ప్రత్యేకతలు ఇవి . మిగతా ప్రాంతం అంతా బ్రిటీష్ వారి పాలనలో వుండేది . ఫ్రెంచ్ వారికి బ్రిటీష్ వారికి మధ్య తేడా వుంది . బ్రిటీష్ వారంత కర్కశంగా ఫ్రెంచ్ వారుండరు .



బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినా పరిపాలనకు చెంది వారి ప్రభావం నుండి పూర్తిగా బయట పడలేకపోతున్నాం . అప్పటి విధానాలు ఇప్పటికీ సాగుతున్నాయి . - ఫ్రెంచ్ వారికీ , పుదుచ్చేరికి మధ్య ఇప్పటికీ సంబంధాలున్నాయి . ఎవరయితే కొన్ని శతాబ్దాల పాటు మనల్ని పారిపాలించారో వారు ఇప్పుడు కూడా ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు అవసరమైన సమయంలో రక్షణగా వుండటం చరిత్రలో విశేషం చెప్పుకోవాలి . | అప్పటి ఒడంబడికలు లేకుంటే ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో పుదుచ్చేరి ప్రజలు యిబ్బందిని ఎదుర్కునే వారే . ఈపాటికి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా మారిపోయేది . మల్లాడి వాదనకు ఫ్రెంచ్ ఒడంబడిక ఒక ఆధారంగా ఉపయోగపడింది . ఇప్పుడు భారతదేశ సంతతి అయినా ఫ్రెంచ్ నేషనాలిటీ వున్న వారున్నారు . వారికి అక్కడ ఓటు హక్కు వుంటుంది . ఫ్రాన్స్ అధ్యక్షుని ఎన్నికలో ప్యానలకు ఓటు వేసే హక్కు వారికి వుంటుంది . ఈ దేశంలో వారికి ఓటు హక్కు వుండదు .

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: చరిత్ర తాలూకు ప్రత్యేకతలు
చరిత్ర తాలూకు ప్రత్యేకతలు
https://1.bp.blogspot.com/-DkA9V8f_Uo0/XZ-pmkppb2I/AAAAAAAAABw/ZOSMfRoEDnEDZiLtSqv2YlTC_d81Z8c2QCLcBGAsYHQ/s1600/%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A6%25E0%25B1%258D%2527%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%2597%25E0%25B0%25A4%25E0%25B0%25BF%2B.%2B%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%258D%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%2597%25E0%25B0%25B0%25E0%25B0%25BF%25E0%25B0%2595%25E0%25B0%25A4%2B.%2B%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%258D%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%25B8%25E0%25B0%2582%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%2595%25E0%25B1%2583%25E0%25B0%25A4%25E0%25B0%25BF.jpg
https://1.bp.blogspot.com/-DkA9V8f_Uo0/XZ-pmkppb2I/AAAAAAAAABw/ZOSMfRoEDnEDZiLtSqv2YlTC_d81Z8c2QCLcBGAsYHQ/s72-c/%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A6%25E0%25B1%258D%2527%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%2597%25E0%25B0%25A4%25E0%25B0%25BF%2B.%2B%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%258D%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%25A8%25E0%25B0%25BE%25E0%25B0%2597%25E0%25B0%25B0%25E0%25B0%25BF%25E0%25B0%2595%25E0%25B0%25A4%2B.%2B%25E0%25B0%25B0%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%258D%2B%25E0%25B0%2585%25E0%25B0%2582%25E0%25B0%259F%25E0%25B1%2587%2B%25E0%25B0%25B8%25E0%25B0%2582%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%2595%25E0%25B1%2583%25E0%25B0%25A4%25E0%25B0%25BF.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/charitra-taalooku-pratyaekatalu.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/charitra-taalooku-pratyaekatalu.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy