Powered by Blogger.

అభివృద్ధి జరగాలి అందరికీ ఆ ఫలాలు చెందాలనేది నా ఆశ

యానాంలో అభివృద్ధి జరగాలి అందరికీ ఆ ఫలాలు చెందాలనేది నా ఆశ - ఆరాటం. ఆ పదం నాకు వర్తించదు. అసలు విషయం నా మీద కొందరి ద్వేషం - ఓర్వలేని తనం. ఇ...

యానాంలో అభివృద్ధి జరగాలి అందరికీ ఆ ఫలాలు చెందాలనేది నా ఆశ - ఆరాటం. ఆ పదం నాకు వర్తించదు. అసలు విషయం నా మీద కొందరి ద్వేషం - ఓర్వలేని తనం. ఇన్నిసార్లు అతను ఎలా గెలుస్తున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అతని చేతిలో చిత్తుగా ఎందుకు ఓడిపోతున్నాం . చివరికి అతను సూచించిన లేదా మద్దతు యిచ్చిన వారి చేతిలోనూ ఘోరంగా ఎందుకు ఓడిపోతున్నాం అనేదే వారి అసలు సిసలు అసూయ. . ఇంక నేను అనుకున్నదే చేస్తాననటం. ఎవరయినా వారు అనుకున్నదే చేస్తారు . గాంధీజీ అంతే . తను సత్యాగ్రహ పద్ధతుల్లో వెళ్లాలనుకున్నాడ. ఆయన సహచరులు వ్యతిరేకించార. అయినా ఆయన పద్ధతి మార్చుకోలేదు. ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక హింసకి దిగినప్పుడు గాంధీజీ ఉద్యమాన్ని విరమించారు. ఆయన నియంతా ! నియంతయితే ఎందుకోసం ? స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం అలా చేసారు. అది అందరికీ నచ్చక పోవచ్చు . . నా విషయానికి వస్తే నేను అనుకున్నది చేయటం వెనక యానాం ప్రజలు వున్నారు . వారి అవసరాలున్నాయి . వారి కోర్కెలున్నాయి . వారి అభిప్రాయాలున్నాయి.

ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాత , యానాం ప్రస్తుత , భవిష్యత్ అవసరాల దృష్ట్యా నేనొకటి అనుకుంటాను . అనుకున్నాక ఆ పనులు పూర్తి చేయటానికి నిరంతరం శ్రమిస్తాను . ఇప్పుడు నేను చేసినవీ , చేస్తున్నవీ , చేయాలనుకున్న వాటిని ప్రతిపక్షాల వారు వద్దంటారా ? అయితే వారు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పుకునే హక్కు వారికి వున్నప్పుడు ఇలాంటి విమర్శలు ఫీలర్లగా వదలటం ఎందుకు ? ఒకప్పుడు ఇక్కడ రెండు సీట్లు . ఇప్పుడు ఒకటయింది . ఒక్క సీటుతో అరుదయిన సమయంలోనే మనం నిర్ణయాత్మక పాత్రను పోషించగలం . అలాంటి సందర్భం ఓసారి వచ్చింది . అప్పుడు నేనేం చేసానో ప్రజలకి - వాళ్లకూ తెలుసు . మామూలుగా అయితే ఎన్నికల్లో ఓడిపోయాక వచ్చే అయిదు సంవత్సరాల వరకు రకరకాల సమస్యల మీద ప్రతిపక్షాలు అసెంబ్లీలోనూ బయటా కూడా నిర్మాణాత్మక పాత్రను పోషించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి . యానాంకి కావల్సింది నిధులు . అభివృద్ధి కార్యక్రమాలు . అందుకోసం ఏ ప్రభుత్వం వున్నా అవి సాధించాలి . అదో కళ . అంతేగాని నేను అసెంబ్లీలోనో , బయటో అరుపులు అరవటం కాదు . ఇండిపెండెంట్ సభ్యులు ప్రభుత్వాల్ని శాసించేవారుగా వుండటం కష్టం . కొన్ని సందర్భాలలో ఒక్క ఓటో , రెండు ఓట్లో ప్రభుత్వాన్ని శాసిస్తున్నప్పుడు వారు బేరాలకు పనికి వస్తారు . వ్యక్తిగతంగా లాభపడతారు .

| నాకు వ్యక్తిగత లాభాలు వుండవు . అందుకే అటువంటి ఏ సందర్భాన్నయినా యానాం ప్రగతి కోసం వినియోగించుకున్నాను . వినియోగించుకుంటున్నాను. ప్రజల్ని నా మాటల్లో మాయ చేస్తాను అనటం నాకు నవ్వు తెప్పిస్తుంది . మాయ చేయడానికి నేను స్వామీజీని కాదు . ప్రజలు ఎప్పుడూ గొర్రెలు కాదు . అలా భ్రమింప చేస్తారు . మాయ మాటలే ప్రజల్ని నమ్మించలేవు . అదే నిజమయితే ఎన్నికలప్పుడు ప్రతిపార్టీ , ఆ పార్టీకి చెందిన నాయకులు గొప్పగా మాట్లాడతారు . అనేక హామీలు యిస్తారు . ప్రత్యర్థులు అవి ఆచరణ సాధ్యం కావు అంటారు . ఒకసారి మన మాటలు వింటారు . ఎప్పుడూ వాటిని నమ్ముతారు అనుకోవటం పొరపాటు . మనల్ని నిర్ణయించేది మన పనులు - మన విజన్ మాత్రమే కాదు . ఆచరణ లేని రాజకీయాలు ఎప్పటికయినా విఫలం కావాల్సిందే . నా వరకు నాకు కొత్త భ్రమల్ని సృష్టించటం చేత కాదు . ప్రజలు గొర్రెలు అనుకోవటంలోనే కొంతమంది అంచనాలో పొరపాటు వుంది . ప్రజలు దేవుళ్లు అని నమ్మితేనే మన ప్రవర్తన , మన ఆచరణ నిజాయితీగా వుంటాయి.

అందుకే ఇలాంటి విమర్శలని నేనే కాదు , ప్రజలూ పట్టించుకోవటం లేదు . అయితే నేను ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను . నేను నా స్టాండ్ ఎప్పుడూ మార్చుకోలేదు - అనేకానేక అవమానాలు ఎదురయినా . నేనూ - నా యానాం , నేనూ - నా యానాం . ఇవే నా ధ్యాస - శ్వాస - ధోరణి - నా సమస్తం . పార్టీలు వేరైనా మల్లాడి కాంగ్రెస్ పార్టీలో వున్నారు . ఆయన ఇతర పార్టీల నేతల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు . ఇది ప్రజల్లోకి అనుమానం కలిగించే సంకేతాలు పంపదా అని ఆయన్ని కొంతమంది అడుగుతారు. “ అనుమానం కలిగేది ప్రజలకా ? పార్టీనాయకులకా ? ” అని తక్షణం ఆయన అడుగుతారు. ఎదుటివారు వెంటనే సమాధానం ఇవ్వటానికి తడబడతారు . “ వాళ్లను నేను అర్ధం చేసుకుంటాను. రాజకీయాల్లో ఓ పార్టీకి చెందినవారు తమకు ప్రత్యర్థి అయిన పార్టీలకు చెందిన వారితో కరచాలనం చేసినా , కాస్త పక్కకు వచ్చి మాట్లాడుకున్నా రకరకాల కథనాలు బయటకి వస్తాయి . పార్టీ మారబోతున్నాడనో , మరొకటో కల్పించి రాస్తారు . ఇంకొంతమంది పార్టీలో సహచరులుగా వుంటూనే , ఇలాంటి వాటిని ఫీలర్లుగా జనం మీదకో , అధిష్టానం దృష్టిలో పడటానికో వదులుతుంటారు .



మా మధ్య జాతి వైరం వుంటుందా ! వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయ భేదాలు వుండొచ్చు . మేం అధికారంలో వున్నాం అనుకోండి ప్రతిపక్షంలో వున్నవారు ఏదన్నా మంచి చేసినా , మంచి విజన్ వున్నా , ఆలోచనలు యిచ్చినా వారిని అభినందించటం తప్పా ? అది పార్టీకి నష్టమా ! అలాగే మేం ప్రతిపక్షంలో వుంటాం , అధికారంలో వున్నవారు మంచి పనులు చేస్తారు . అప్పుడు అభినందించకూడదా ! అంటే మిగతా ప్రజలందరికీ వుండే హక్కు మాకు వుండదా . . . మనం ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణం నుండి చూడటానికి అలవాటు పడటం వలన ఇలాంటివి వస్తాయి . . ప్రజలకు అనుమానం కలగదు . పైగా ఎదుటి వారు మంచి పనులు చేస్తున్నా వీళ్లకు కనపడదు . ప్రతి దానిలోనూ వంకలు వెతుకుతారు అని జనం ఓసారి నిర్ణయానికి వస్తే ప్రజలు అలాంటి వ్యక్తుల్ని , పార్టీలను నమ్మరు . చివరకి నిజం చెప్పినా “ నాన్నా పులి ” కథలాంటి స్థితే . అందుకే పదే పదే వ్యతిరేకంగా మాట్లాడటం , ప్రచారం చేయటం రాజకీయ పార్టీలకు నష్టదాయమైన ఎత్తుగడలుగానే మిగులుతాయి ” మల్లాడి నుండి ఇలాంటి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో వున్నాయి . మీకున్న దృష్టి ఎదుటి వారికి వుండాలి కదా అని ఇంకో ప్రశ్న అడుగుతారు . “ అందుకు నేనేం చేయగలను బ్రదర్ .

నాలాగే ఆలోచించాలని , ప్రవర్తించాలని ఫోర్స్ చేయగలనా ” అంటే “ అదీ నిజమేలెండి ” అని సమాధాన పడటం జరుగుతుంది . | కమ్యూనిజం నేను కమ్యూనిస్ట్ సిద్దాంతాల గురించి లోతుగా తెలుసుకోలేదు . అయితే చిన్నప్పటి నుంచి కొంతమంది వ్యక్తుల గురించి విన్నాను . కొంతమందిని చూసాను . అప్పటివారికి ఇప్పటివారికి తేడా వుందని చెప్పగలను . ఇప్పుడు కొంతమందిలో ఎలాంటి సిద్దాంతం లేదు . బ్లాక్ మెయిలింగ్ , పర్సంటేజ్లు తీసుకోవటం ఇంకా ఎన్నో అవలక్షణాలు వచ్చినట్టుగా వింటున్నాం . అప్పట్లో పోరాటాలు జరిగాయి . ఆ పరిస్థితులు వేరు . భూస్వాములకి , రైతులకి కూలీలకు మధ్య ఎన్నో అంతరాలుండేవి . ఆ రోజు ఆ పార్టీ అవసరం వుందని నేను అనుకుంటాను . ఇప్పుడు పరిస్థితులు మారాయి . కమ్యూనిస్టులు పేదవారికి ఎక్కువ చేయాలనుకోవచ్చు . అన్ని వర్గాల వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి . | నేను కమ్యూనిస్టుని కాకపోవచ్చు . వారి పాలసీలో చెప్పుకునే అనేకమైన వాటిని అమలు చేస్తానన్న తృప్తి నాకుంది . భవిష్యత్ ఎంత ముఖ్యమో , వర్తమానం అంత ముఖ్యం . అదే రేపటిని నిర్ణయిస్తుంది.

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: అభివృద్ధి జరగాలి అందరికీ ఆ ఫలాలు చెందాలనేది నా ఆశ
అభివృద్ధి జరగాలి అందరికీ ఆ ఫలాలు చెందాలనేది నా ఆశ
https://1.bp.blogspot.com/-HjTi3Qwo1uk/XZ-o8Ib4C9I/AAAAAAAAABY/1OyIyEn-DzkVeQ3Hz3nQxtOcRnoZhv8egCLcBGAsYHQ/s1600/%25E0%25B0%25AE%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE%25E0%25B0%25A1%25E0%25B0%25BF%2B%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%259C%25E0%25B0%2595%25E0%25B1%2580%25E0%25B0%25AF%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A5%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B0%2582%2B%25E0%25B0%2597%25E0%25B1%2581%25E0%25B0%25B0%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BF%2B%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B0%25BE%2B%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25B7%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B1%2581%2B%25E0%25B0%25A4%25E0%25B1%2586%25E0%25B0%25B2%25E0%25B1%2581%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%258B%25E0%25B0%25B5%25E0%25B0%259A%25E0%25B1%258D%25E0%25B0%259A%25E0%25B1%2581.jpg
https://1.bp.blogspot.com/-HjTi3Qwo1uk/XZ-o8Ib4C9I/AAAAAAAAABY/1OyIyEn-DzkVeQ3Hz3nQxtOcRnoZhv8egCLcBGAsYHQ/s72-c/%25E0%25B0%25AE%25E0%25B0%25B2%25E0%25B1%258D%25E0%25B0%25B2%25E0%25B0%25BE%25E0%25B0%25A1%25E0%25B0%25BF%2B%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%259C%25E0%25B0%2595%25E0%25B1%2580%25E0%25B0%25AF%2B%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A5%25E0%25B0%25BE%25E0%25B0%25A8%25E0%25B0%2582%2B%25E0%25B0%2597%25E0%25B1%2581%25E0%25B0%25B0%25E0%25B0%25BF%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BF%2B%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B0%25BE%2B%25E0%25B0%25B5%25E0%25B0%25BF%25E0%25B0%25B7%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B2%25E0%25B1%2581%2B%25E0%25B0%25A4%25E0%25B1%2586%25E0%25B0%25B2%25E0%25B1%2581%25E0%25B0%25B8%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%258B%25E0%25B0%25B5%25E0%25B0%259A%25E0%25B1%258D%25E0%25B0%259A%25E0%25B1%2581.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/abhivRddhi-jaragaali-aMdarikee-aa-phalaalu-cheMdaalanaedi-naa-aaSa.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/abhivRddhi-jaragaali-aMdarikee-aa-phalaalu-cheMdaalanaedi-naa-aaSa.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy