Powered by Blogger.

అంతరంగాలు యానాంలో వున్నప్పుడు నాకు సమయం వుండదు

అంతరంగాలు యానాంలో వున్నప్పుడు నాకు సమయం వుండదు . అందుకే రిలాక్స్ కావటానికి అప్పుడప్పుడు బయట గ్రామాలకు వెళ్తుంటాను . ఒకచోట నుండి మరొక చోటకు...

అంతరంగాలు యానాంలో వున్నప్పుడు నాకు సమయం వుండదు . అందుకే రిలాక్స్ కావటానికి అప్పుడప్పుడు బయట గ్రామాలకు వెళ్తుంటాను . ఒకచోట నుండి మరొక చోటకు వెళ్లి అక్కడ ప్రజలతో మమేకమై అక్కడి సమస్యలు తెలుసుకొని తీర్చడమే నాకు గొప్ప రిలాక్స్డ్ గా వుంటుంది . నేను ఎవరితో మాట్లాడినా , అది అధికారులుగాని , ఉద్యోగులుగాని , ప్రజలుగాని , కళాకారులుగాని , నాకు చెందిన ఎవరయినాగాని నేను మల్లాడిని ' అని మాత్రమే అంటాను . ఎం . ఎల్ . ఎ . నీ మాట్లాడుతున్నాననో , మంత్రిని మాట్లాడుతున్నాననో అనను . బయటివారు ఇతరులతో నా గురించి మాట్లాడేటప్పుడు నా పదవుల ద్వారా నన్ను గుర్తించటం నాకు నచ్చదు . పదవులు వస్తుంటాయి . పోతుంటాయి . నాకు ' మల్లాడి ' గా గుర్తింపు వస్తే అది చనిపోయేదాకా వుంటుంది అన్నారు మల్లాడి . దానికి చిన్న జోడింపు వుంది . చనిపోయాకా వుంటుంది ' పదవుల వల్ల మనలో ' అహం ' పెరుగుతుంది . అది మనలోకి ఎలా ప్రవేశిస్తుందో మనకు తెలియదు . అది మనతో సహజీవనం చేస్తుందనేది మనం గుర్తించం . ఒక్కో వైఫల్యం మనల్ని ఆలోచింప చేస్తుందేమో గాని , అది మన ఫెయిల్యూర్ కి మనకు తృప్తి నిచ్చే లాజిక్తో వుంటుంది . రాజకీయాల్లో అంతరాత్మ , ఆత్మ పరిశీలన అనే మాటలు పూర్తిగా నెగిటివ్ భాష్యాలతో వుంటాయి . సాధ్యమైనంత వరకు ఈ అహానికి దూరంగా వుండే ప్రయత్నం చేయాలి . అది ఎప్పుడయినా మనల్ని మింగేయవచ్చు * ప్రతిరోజూ భోజనం చేస్తాం . అలాగే ప్రతి రోజూ నేను ఆలోచిస్తుంటాను . ' యానాం కి నేను చేయాల్సింది ఏమిటి అని ! అప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి . *

రాజస్థాన్ పర్యటనలో సంప్రదాయాన్ని చూసాను . పెయింటింగ్లు వేయించాలన్న ఆలోచన రాజస్థాన్ని చూసాక వచ్చింది . అలాంటి ప్రాంతాలు చూసినప్పుడు తప్పకుండా మంచి ఆలోచనలు వస్తాయి . నాకు విదేశాలు చూసే అవకాశం లభించింది . అప్పట్లో నాకు పారిస్ - లండన్ బాగా నచ్చాయి . అక్కడి పురాతన , చారిత్రక కట్టడాలు అపురూపంగా వున్నాయి . ఇప్పుడయితే మలేసియా - సింగపూర్లు నచ్చుతాయి . చిన్న ప్రాంతం అయినా ఎంతో ప్రణాళికతో నిర్మించారు . పాత , కొత్త మలేసియాలో ఆకుపచ్చతనం 90వ దశకానికి ముందు యానాంలోనూ , చుట్టుపక్కల గ్రామాల్లోనూ మత్స్యకారులది దయనీయమైన పరిస్థితి . ఇక్కడ జనాభా పరంగా ఎక్కువ శాతం వున్నా , వారు ఎలాంటి అభి వృద్ధికి నోచుకోలేదు . అనేక వర్గాల నిరాదరణకి గురయ్యారు . నిష్కారణంగా ఎవరయినా కొట్టినా , దాడులు చేసినా , అసభ్యంగా దూషించినా , పోలీసుల నుండి ఇతరుల నుండి వేధింపులకు గురయినా , తలవంచుకుని అన్నింటిని భరించే స్థితి వుండేది . అలాంటి రోజుల్లో రక్ష హరికృష్ణగారు మత్స్యకారులను ఓ కూటమిగా తయారు చేశారు . అలా ఆయన నాటిన మొక్కను , ఇప్పుడు వటవృక్షంగా విస్తరించటానికి మల్లాడి దూరదృష్టితో వ్యవహరించారు . అప్పటిదాకా వారికి ఓ దిశ అంటూ లేదు .
1991లో అగ్రహారం ఫిషర్ మేన్ కో - ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా మల్లాడి ఎన్నికయ్యారు . చింతావారి వీధిలో స్థలం కొని అగ్నికుల క్షత్రియ భవనం నిర్మించారు . ముందుగా మత్స్యకారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు రావటానికి కార్యక్రమం రూపొందించుకున్నారు . అణచివేత , నిరక్షరాస్యత నుండి , ప్రకృతి విలయాల నుండి వారు విముక్తి కావాలి . అటు నుండి అభివృద్ధి పథంలో వారు పరుగులు తీయాలి . 1996 నవంబర్ 6న విరుచుకుపడ్డ పెను తుఫాన్ లో సావిత్రినగర్ , గిరియాం పేట తదితర గ్రామాల్లో 94 మంది మృతి చెందారు . ఉప్పెన ముంచి వేయటంతో సర్వస్వం కోల్పోయి కట్బ బట్టల్లో మిగిలారు . అలాంటి సమయం లో పుదుచ్చేరి ముఖ్య మంత్రీ ఆర్ . వి . జానకిరామన్ని , మంత్రివర్గ సభ్యుల్ని , ప్రధాన శాఖల అధికారుల్ని మల్లాడి యానాంకి తీసుకువచ్చారు . ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానికి విశేష కృషి చేసారు . ఆ తర్వాత ఓ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యా యి . కొద్దిపాటి గుడి సెలతో , అపరిశుభ్రంగా , నాగరికతకు దూరంగా వున్న సావిత్రినగర్ ఇప్పుడు యానాంలోనే పెద్ద గ్రామంగా తయారయింది . ఎందుకు గెలవాలో నాకు తెలుసు . నేను ఏదీ ఆశించను . నిస్వార్థంగా చేసే నా సేవలే కోట్లతో సమానం అని మా ప్రజలు అనుకుంటారు కాబట్టి కోట్లు ఖర్చు పెట్టను . ఒక్కోసారి సభల్లో వుంటాం .


అప్పుడు నాతోపాటు ఎవరెవరో మాట్లాడుతుంటారు . ఆ సభ అయ్యాక కాస్త తీరికగా వున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో చెప్పిన ఓ మంచి వాక్యమో , కవిత్వమో గుర్తు వస్తాయి . కొన్నయితే కుదిపేస్తాయి . అప్పటికప్పుడు వారికి ఫోన్ చేసి అభినందిస్తుంటాను . ' యానాం ' టవర్ నిర్మించాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది ? ఇది కట్టడానికి ఇంత డబ్బు ఎలా తీసుకు రాగలిగావు , అని చాలామంది నన్ను అడుగుతుంటారు . * విగ్రహాలకూ , కొన్ని నిర్మాణాలకు కొంతమంది పేర్లు పెడుతుంటాం . అప్పుడు కొంతమంది ఇవన్నీ అవసరమా అని వెటకారం చేస్తారు . నేను అంటాను నీకు మాత్రం పేరెందుకు అని . ఒకరు ఏదో కొత్త విషయం కనుక్కుంటారు . అలాంటి వాటికి వారి పేరు ఎందుకు పెడుతున్నారు అని అడగటం లేదు . చిన్నపిల్లల నుండి ఎవరు ఏ పని చేసినా దానిని ఎదుటి వారు గుర్తించాలి అనుకుంటారు . అలా అనుకోకపోతే ఈ ప్రపంచం ఇలా వుండదు . యానాంలో అడుక్కు తినేవారు మొత్తంగా చూస్తే ఇరవై అయిదు నుండి ముఫై మంది వుంటారు . వీళ్లంతా బయటినుండి వచ్చిన వారు . ఇక్కడున్న వారిలో ఇద్దరు , ముగ్గురుండవచ్చు . అందుకు వారి మానసిక స్థితి కారణం తప్ప ఆర్థికంకాదు . ఇన్ని రకాల ప్రయోజనాలు పొందుతూ ఇంకా అడుక్కోవటం అంటే అది ఓ రోగం అనుకుంటాను . బయట నుండి వస్తున్న వారి గురించి ఆలోచిస్తున్నాం . మత్స్యకారులు నిన్న నేడు నేను రాజకీయ రంగంలోకి అడుగుపెట్టక ముందు అనేక విషయాలు తెలియవు . క్రమంగా చాలా విషయాలు తెలుసుకున్నాను . నాకు అర్థమైంది ఒకటే . అధిక సంఖ్యలో వున్న కులాలవారు అసంఘటితంగా వున్నారు . వారు బి . సి . లు కావచ్చు , దళితులు కావచ్చు , గిరిజనులు కావచ్చు . ప్రభుత్వాలు వారికి కొన్ని సౌకర్యాలు కలిగించవచ్చు . అయితే రాజకీయంగా అధికారంలోనూ , ప్రతిపక్షంగా కూడా ఎదగాలి . అప్పుడు మాత్రమే ఆర్థికంగానూ , సామాజికంగానూ తలెత్తి నిలబడగలరు . రాజకీయ చైతన్యం లేకపోతే వారు ఎంతకాలమైనా ఎవరికోసమో ఎదురుచూడటం తప్ప . నిర్ణయాత్మక పాత్ర పోషించలేరు . - మల్లాడి

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: అంతరంగాలు యానాంలో వున్నప్పుడు నాకు సమయం వుండదు
అంతరంగాలు యానాంలో వున్నప్పుడు నాకు సమయం వుండదు
https://1.bp.blogspot.com/-3hgZc7WKesI/XZ-sD-YmzKI/AAAAAAAAAC4/D7taH9YuSJgs_dQFcOJEno3CV1OwssMTQCLcBGAsYHQ/s1600/sMQiL_2v4vs.jpg
https://1.bp.blogspot.com/-3hgZc7WKesI/XZ-sD-YmzKI/AAAAAAAAAC4/D7taH9YuSJgs_dQFcOJEno3CV1OwssMTQCLcBGAsYHQ/s72-c/sMQiL_2v4vs.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/aMtaraMgaalu.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/aMtaraMgaalu.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy